అలనాటి తారలు కలిసిన వేళ.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్
1980వ దశకంలో సినీ ఇండస్ట్రీలో మెరిసిన తారలు మళ్ళీ కలిశారు. ప్రతి ఏటా జరిగే 80వ దశకం నటీనటులు కలయిక ఎప్పట్నుంచో సాంప్రదాయంగా వస్తోంది. తమ దశాబ్దాల నాటి స్నేహాన్ని, అలాగే ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి జరుపుకునే ఈ మీట్‌కి ఈ ఏడాది కూడా తారలు తరలి వచ్చారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్, నరేష్ తదితరులు హాజరుకాగా.. ఇతర ఇండస్ట్రీల నుంచి పలువురు స్టార్ నటులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ఇక అందరూ కలిసి ఒకే డ్రెస్ కోడ్‌లో హాజరయినట్లు ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ వేడుకపై చిరంజీవి ఎక్స్ వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా సదరు ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి… ‘నా ప్రియమైన స్నేహితులతో ప్రతీ రీయూనియన్ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతే. ఇవి ఎప్పటికీ అందమైన జ్ఞాపకాలే. దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఈ బంధం విడదీయరానిది’అని చిరంజీవి సంతోషాన్ని వ్యక్తంచేశారు. చెన్నైలో వరదల కారణంగా గతేడాది వాయిదా పడగా, తాజాగా అక్టోబరు 4న దక్షిణాది, ఉత్తరాదికి చెందిన మొత్తం 31 మంది కలిసి చెన్నైలో పార్టీ చేసుకున్నారు. దీనిపై.. చిరంజీవి ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా పంచుకుంటూ.. ఎన్నో అందమైన జ్ఞాపకాలు, మరెన్నో నవ్వులతో ఈ వేడుక ఆనందంగా సాగింది.. ప్రతిసారీ.. ఈ మీట్.. మొదటి సమావేశంలానే అనిపిస్తుందని చిరంజీవి తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రీయూనియన్ వేడుకలో చిరంజీవి, వెంకటేశ్, జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, రాజ్‌కుమార్ సేతుపతి, నరేశ్, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభనలతో పాటు మరికొందరు అగ్రతారలు పాల్గొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రంలో డైవర్లకు దొరికిన రూ. 830 కోట్ల నిధి
Everest: ఎవరెస్ట్ శిఖరంపై మంచు తుఫాన్.. చిక్కుకున్న 1000 మంది పర్వతారోహకులు
US Army Beard Ban: సైనికులు గడ్డాలు పెంచుకోవడంపై నిషేధం
Rohit Sharma: రోహిత్ శర్మకు ఊహించని షాక్
New Traffic Rules: వాహనదారులకు ఇక దబిడి దిబిడే.. కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే!
