ఉదయాన్నే ప్లెయిన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్‌ విషయం విన్నారా ??

Updated on: Apr 19, 2026 | 1:36 PM

దోసె ఉదయం టిఫిన్‌గా తినడం వల్ల త్వరగా ఆకలి వేసి, అధిక క్యాలరీలు తీసుకుంటామని ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ్ సింగ్ హెచ్చరిస్తున్నారు. దోసె రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, తగ్గించడం వల్లనే ఇలా జరుగుతుంది. దీన్ని నివారించడానికి, కడుపు నిండిన అనుభూతి కోసం మసాలా లేదా పనీర్ వంటి ఫిల్లింగ్స్‌తో దోసె తినాలని ఆయన సూచిస్తున్నారు.

దోసె ఎవరికైనా ఒక ఎమోషన్‌. రోజులో ఏ సమయంలోనైనా తినగలిగే తేలికైన, పోషకమైన టిఫిన్‌ అనుకుంటాం. అయితే ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్థ సింగ్ ఉదయం టిఫిన్‌లో దోసె తినడం మానుకోవాలని తెలిపారు. విచిత్రంగా అనిపిస్తోందా? దీనికి కారణాలను కూడా విశ్లేషించారు. దోశలో స్వతహాగా అనారోగ్యకరమైనదేమీ కాదు.. అది కేవలం బియ్యం, మినపపప్పును పులియబెట్టి తయారు చేస్తారు. సాంబార్ కూడా ఒక పప్పు పదార్థమే కాబట్టి అదీ అరోగ్యకరమే .అసలు సమస్య అది కడుపు నింపే గుణం విషయంలోనే ఉందని సింగ్ తెలిపారు. దోసె సులభంగా జీర్ణమైనప్పటికీ, గంటలోపే ఆకలి వేస్తుంది. ఆకలి ఎక్కువ కావడంతో అదనపు కేలరీలను తీసుకుంటాం. దోసె తిన్న వెంటనే, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది, ఆ తర్వాత అంతే వేగంగా పడిపోతుంది. వెంటనే ఆకలి వేయడానికి కారణం ‘హై గ్లైసెమిక్ రెస్పాన్స్’ అంటారు. మితంగా తినాలి. వెంటనే దోసెకు చెక్‌ పెడదాం అనుకుంటున్నారా. ఆగండాగండి. ఈ సెలబ్రిటీ ట్రైనర్ దగ్గర ఒక పరిష్కారం ఉంది. కడుపు నిండింది అనే ఫీలింగ్‌ రావడానికి దోసె లోపల రుచికరమైన ఫిల్లింగ్‌ను జోడించాలని సూచిస్తున్నారు. అంటే తురిమిన పనీర్‌ దట్టించిన దోసె కానీ, మసాలా దోసె కాని తీనమని సలహా ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: వైరల్ అవుతున్న రష్మిక మేకప్ టాపిక్

Renu Desai: బద్రి సినిమా ముచ్చట్లు చెప్పిన రేణు దేశాయ్

Brahmastra 2: బ్రహ్మాస్త్ర సీక్వెల్ షూటింగ్ అప్‌డేట్ రివీల్

Dhurandhar: టాప్‌లో దూసుకుపోతున్న ధురంధర్ ఫ్రాంఛైజీ

Devara: దేవర సెట్లో వారణాసి మూవీ షూటింగ్

Loading...
Unable to load recommendations.
Follow Us