తాజ్‌మహల్ కనిపించుట లేదు.. పొగమంచులో ఉత్తర భారతం

Updated on: Dec 24, 2025 | 10:17 AM

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరి, AQI 450 దాటింది. పొగమంచుతో ఇండియా గేట్ వద్ద విజిబిలిటీ జీరోకి పడిపోయింది. వందలాది విమానాలు, రైళ్లు రద్దు/ఆలస్యమయ్యాయి. ఉత్తర భారతాన్ని కమ్మేసిన పొగమంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. తాజ్‌మహల్ కూడా కనిపించక టూరిస్టులు నిరాశపడ్డారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రికార్డు స్థాయిలో 450 దాటి డేంజర్‌ కేటగిరీలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా.. ఇండియా గేట్, కర్తవ్య పథ్ పరిసరాల్లో దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. మంచుదుప్పటి కమ్మేయడంతో ఢిల్లీలో పలు ప్రాంతాల్లో విజిబిలిటీ జీరోకి పడిపోయింది. దీంతో.. ఢిల్లీలో 100కు పైగా విమానాలు రద్దు కాగా.. సుమారు 200 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే ముందు అప్‌డేట్‌ చెక్‌ చేసుకోవాలని ప్రయాణికులకు విమానయాన సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అలాగే.. 50 రైళ్లతోపాటు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గి వాహనాలు నెమ్మదిగా నడుస్తున్నాయి. అటు.. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ సైతం వాయుకాలుష్యం కారణంగా కనిపించకుండా పోతోంది. దీంతో.. తాజ్‌మహల్‌ అందాలు చూసేందుకు వచ్చిన టూరిస్టులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మరోవైపు.. ఉత్తర భారత దేశాన్ని పొగమంచు కమ్మేసింది. ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచు అలముకోవడంతో సాధారణ జనజీవితానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. పొగమంచు తీవ్రతతో ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్‌లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా జతవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ క్రమంలోనే.. ఉత్తర భారతంలోని ఢిల్లీ, హర్యానా, చండీగఢ్‌, ఉత్తరాఖండ్‌కు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌ న్యూస్‌.. స్పర్శ దర్శనం సమయాలు

ఒక్క గ్రామ పంచాయతీకి ఇద్దరు సర్పంచులా ?? ఇదెక్కడి ట్విస్ట్

‘కమెడియన్స్‌ది ఏ స్థానమో మళ్లీ చూపించారు’ మీకో దండం

Demon Pavan: డీమాన్ పవన్‌కు జాక్‌ పాట్ విన్నర్‌ ప్రైజీ మనీకి సమానంగా నొక్కాడు

మెడికల్ మాఫియాపై ఇంట్రెస్టింగ్ సీరిస్! ‘ఫార్మా’ సిరీస్ రివ్యూ