కొబ్బరి మంచిదని అదేపనిగా తినేస్తున్నారా.. జాగ్రత్త వీడియో

Updated on: May 18, 2025 | 12:48 PM

కొబ్బరి అంటే ఇష్టపడని వారు ఉండరు. పచ్చి కొబ్బరి తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతారు. సాధారణంగా కొబ్బరిని ఎక్కువగా చట్నీ చేసుకొని తింటారు. అలాగే వివిధ రకాల వంటకాల్లో కూడా కొబ్బరిని ఉపయోగిస్తారు. ఇది ఆయా వంటకాాలకు మంచి రుచిని అందిస్తుంది. కొబ్బరిలో ఫైబర్, మాంగనీస్, సెలీనియం, రాగి, ఫాస్ఫరస్, పొటాషియం, ఇనుము, జింక్ అనేక ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.

కొబ్బరికాయను పగలగొట్టి దానిలోని తెల్ల కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి నీటిలో నానబెట్టి తింటే ఎంతో మంచిదంటున్నారు. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం కొబ్బరిని నానబెట్టి ఆ నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందట. కొబ్బరిని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు అంటున్నారు. నానబెట్టిన కొబ్బరిని తింటే శరీరానికి ఫైబర్ అధికంగా అందుతుంది. రక్తహీనత, బలహీనత వంటి సమస్యలున్న వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. సన్నగా ఉన్న వారికి బరువు పెరగడానికి ఇది మంచి ఆహారంగా చెబుతున్నారు. నానబెట్టిన కొబ్బరిని నల్లమిరియాలతో కలిపి తింటే కంటి చూపు మెరుగు అవుతుందట. మెదడు ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుందట. అయితే కొబ్బరిని అతిగా తింటే ప్రమాదం అంటున్నారు. ఎల్లప్పుడూ కొబ్బరిని మితంగానే తినాలని సూచిస్తున్నారు. రోజుకి ఒకటి లేదా ఒకటిన్నర అంగుళం కొబ్బరి ముక్క తింటే సరిపోతుందట. ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.