అంతా శివలీలే..ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము, పిల్లి ఎదురెదురుగా వచ్చినా ఎలాంటి ఘర్షణ లేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయిన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు వీడియోగా చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని శివలీలగా పలువురు భక్తులు భావిస్తుండగా, మరికొందరు అరుదైన సహజ ప్రవర్తనగా చర్చిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము, పిల్లి ఎదురెదురుగా వచ్చినా ఎలాంటి ఘర్షణ లేకుండా ప్రశాంతంగా వెళ్లిపోయిన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని భక్తులు వీడియోగా చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని శివలీలగా పలువురు భక్తులు భావిస్తుండగా, మరికొందరు అరుదైన సహజ ప్రవర్తనగా చర్చిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో నిత్యం పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. అయితే, తాజాగా ఆలయ ప్రాంగణంలోని పొగడ చెట్టు సమీపంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్న సమయంలో.. అకస్మాత్తుగా అక్కడ ఒక నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయ ప్రాంగణంలో పరస్పర విరుద్ధ స్వభావం కలిగిన నాగుపాము, పిల్లి ముఖాముఖీగా ఎదురయ్యాయి. సాధారణంగా ఒకదానినొకటి చూస్తే దాడి చేసుకునే ఈ రెండు జీవులు.. స్వామివారి సన్నిధిలో మాత్రం శాంతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సరిగ్గా అదే సమయానికి ఆలయంలో తిరుగుతున్న ఒక పిల్లి కూడా ఆ నాగుపాము వద్దకు చేరుకుంది. సాధారణంగా పాము, పిల్లి ఎదురుపడితే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే.. ఒకదానిపై ఒకటి ప్రాణాంతకంగా దాడికి దిగుతాయి. అక్కడ ఉన్న భక్తులు కూడా ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఊపిరి బిగబట్టి చూశారు.. కానీ, అక్కడ మాత్రం ప్రకృతి నియమాలకు భిన్నంగా, అంతా విస్తుపోయేలా మిరాకిల్ జరిగింది. మొదట రెండు జీవులు దాడికి సిద్ధపడుతున్నట్లు అనిపించినా.. కొద్దిసేపట్లోనే అక్కడ వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది. పిల్లి నెమ్మదిగా కొంత దూరం వెళ్లి కూర్చోగా.. నాగుపాము పడగ విప్పి ఆ పిల్లి వైపు కొద్దిసేపు నిశ్శబ్దంగా గమనించింది. ఎలాంటి ఘర్షణ లేకుండా, ఒకదానికొకటి హాని చేసుకోకుండా..కాసేపటి తర్వాత రెండు జీవులు అక్కడి నుండి శాంతంగా వెనుతిరిగాయి. అయితే.. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి, వెంటనే తమ సెల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. పరస్పర విరుద్ధ స్వభావం, బద్ధ శత్రుత్వం కలిగిన జీవులు స్వామి వారి సన్నిధిలో ఇలా ప్రశాంతంగా సంచరించడం శివలీలేనని భక్తులు నమ్ముతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్ అవుతారు!
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

