News Watch: అందరి చూపులు కేసీఆర్ సభవైపే.. మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆదివారం చండూరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మండల కేంద్రంలోని బంగారిగడ్డ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
మునుగోడు ఎప ఎన్నిక చివరి దశకు చేరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచిన బై పోల్ కు సమయం దగ్గరపడింది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపునకు పార్టీ ముఖ్య నేతలు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ పార్టీకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆదివారం చండూరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మండల కేంద్రంలోని బంగారిగడ్డ ప్రాంతంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సభ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే ఆగస్టు 20న మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సభకు జన సమీకరణ కోసం ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలో మండల ఇన్‌ఛార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.