AP News: ఏపీ మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. ఇది కదా కావాల్సింది

|

Nov 15, 2024 | 11:55 AM

మందుబాబులకు మరో గుడ్ న్యూస్ అందించింది కూటమి సర్కార్. ఏపీలో మద్యం కనీస ధర ఖరారుకు కమిటీని ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. ఆ వివరాలు.. ఆ స్టోరీ ఏంటంటే.?

ఏపీలో మద్యం కనీస ధర ఖరారుకు టెండర్ కమిటీ ఏర్పాటైంది. రిటైర్డ్ హైకోర్డు జడ్జి సునీల్ చౌదరి ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా మాజీ ఐఏఎస్ అధికారి బీఆర్ మీనా, మాచారావుని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుగోలు చేసే మద్యానికి కనీస ధర‌ను ఈ కమిటీ నిర్ణయిస్తుంది. అలాగే మద్యం కొనుగోలుకు సంబంధించి ఈ కమిటీ కొత్త మార్గదర్శకాలు సిఫార్సు చేయనుంది.

అటు శాసనమండలిలో మంత్రి కోల్లు రవీంద్ర లిక్కర్ పాలసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే గొప్ప లిక్కర్ పాలసీ ఏపీలో ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అంతేకాదు లిక్కర్ రేట్లు తగ్గించే దానిపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఈ పాలసీతో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగిందన్నారు కొల్లు. వైసీపీ హయాంలో 18వేల కోట్ల దోపిడీ జరిగిందన్న కొల్లు.. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో రేట్లు తక్కువ ఉన్నాయని కౌంటర్‌ ఇచ్చారు. లిక్కర్ దోపిడీపై సీఐడీ విచారణ జరిపిస్తామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.

ఇది చదవండి: 

గోదారి గట్టు సమీపాన మెరుస్తూ కనిపించిన వింత ఆకారం.. ఏంటని చూడగా.. బాబోయ్

అయ్యబాబోయ్.. ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ ఇదే.. చూస్తే బిత్తరపోతారు

 విద్యార్ధులకు గుడ్‌న్యూస్ అంటే ఇది కదా.. ఒక్కొక్కరికి రూ. 6 వేలు 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 15, 2024 08:56 AM