ఈ సమస్యలు ఉంటే చియా విత్తనాలను దూరం పెట్టండి..వీడియో
చియా సీడ్స్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ఒమేగా 3, బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వారు చియా సీడ్స్ ను రోజు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె, ఎముకలు, కండరాలు, చర్మం మొదలైన వాటికి ప్రయోజనాలను అందిస్తుంది.
చియా విత్తనాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తినకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారు చియా గింజలను రోజు తినకూడదు. దీనివల్ల కడుపునొప్పి, వాపు, విరేచనాలు, తిమ్మిర్లు వంటి సమస్యలు రావచ్చు. కొందరికి చియా గింజలు అంటే అలర్జీ ఉండవచ్చు. వీటిని తిన్న తర్వాత దద్దుర్లు లేదా మరి ఏదైనా సమస్య ఏర్పడితే వీటిని తినవద్దంటున్నారు. బిపి పేషెంట్ అయితే అధిక రక్తపోటును నియంత్రించడానికి మందులు తీసుకుంటుంటే చియా విత్తనాలను తినకూడదంటున్నారు. చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతాయి.