Chennai Rains Viral Video: చెన్నైలో కుండపోత వర్షాలు.. వరదనీటిలో ఇంజనీరింగ్ కాలేజీ

|

Oct 16, 2024 | 6:43 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్ నీట మునిగిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో తీర ప్రాంతమైన తమిళనాడును భారీ వర్షాలు చెత్తుతున్నాయి. చెన్నైతో పాటు పరిసర జిల్లాల్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. జనజీవనం స్థంభించిపోయింది. చెన్నైలోని చాలా ప్రాంతాల్లో 15 సెం.మీ కంటే ఎక్కవ వర్షపాతం నమోదు అయింది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇళ్ళలోకి చేరింది. చెన్నై శివారులోని సత్యభామ ఇంజనీరింగ్ కాలేజీలోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో విద్యార్థుల పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. కొందరు స్టూడెంట్స్ బోట్స్ సాయంతో కాలేజీ హాస్టల్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా చెన్నై మెట్రో పనుల్లో డ్రైనేజీ మూసుకుపోయవడంతో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. నగరంలోని చాలా జంక్షన్లను వరద నీరు చుట్టుముట్టింది. వాల్మీకి నగర్, AGS కాలనీ, కామరాజర్ నగర్, అడయార్‌లోని శాస్త్రి నగర్, నేతాజీ కాలనీ, రామ్ నగర్, వేలచ్చేరి, పెరంబూర్‌లోని ఇళ్లలోకి నీరు చేరింది.ఎడతెఎరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైళ్లు, బస్సులు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని రద్దు చేయగా..మరికొన్నింటిని వాయిదా తాత్కాలికంగా నిలిపివేశారు.

భారీ వర్షాల నేపధ్యంలో చెన్నై నగరానికి హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇవాళ ,రేపు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా పలు ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం ప్రకటించాయి.

Follow us on