వామ్మో.. చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
అన్నమయ్య జిల్లా పీలేరులో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వేళల్లో ముసుగులు ధరించి శివారు ప్రాంతాల్లో సంచరిస్తూ చోరీలకు యత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా సీసీ కెమెరాలను తొలగించి ఇళ్లలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.
చెడ్డీగ్యాంగ్ మళ్లీ వచ్చింది.. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో ‘చెడ్డి గ్యాంగ్’ రెచ్చిపోయింది. స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తూ.. గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి వేళల్లో ఈ ముఠా సభ్యులు వరుస చోరీలకు యత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా పీలేరు శివారు ప్రాంతాలైన నాగిరెడ్డి కాలనీ, కోటపల్లి, గరుడాద్రి నగర్ పరిసర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేయడానికి వీరు పథకం రచిస్తున్నట్టు గుర్తించారు. ఈ ముఠా సభ్యులు ముసుగులు ధరించి, అర్ధరాత్రి వేళల్లో ఇళ్ల పరిసరాల్లో సంచరిస్తున్నారు. చోరీలకు ముందే ఇళ్లకు ఉన్న సీసీ కెమెరాలను తొలగించి, ఆపై లోపలికి చొరబడేందుకు యత్నిస్తుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధానంగా పట్టణ శివార్లలో ఒంటరిగా ఉన్న ఇళ్లే టార్గెట్గా వీరు విరుచుకుపడుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. రాత్రి వేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ ప్రజలను కోరారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గ్యాంగ్ కదలికలపై నిఘా పెంచామని, త్వరలోనే వారిని పట్టుకుంటామని స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!
TTD: టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి సేవకులకు సీబిల్ తరహా రేటింగ్
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది.. సీసీ కెమెరాలు పీకేసి మరీ..
తాంత్రిక పూజల పేరుతో మహిళపై లైంగిక దాడి!
భార్యను ఉరితీసి.. తల్లిదండ్రులకు వీడియో కాల్లో చూపించిన భర్త!
ఇదేం భక్తయ్యా.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!
మృగాన్నే అయినా.. నేనూ అమ్మనే.. కొంచెం ఆగండి!
ఓరి మీ కక్కుర్తి కూలా.. ఇదేం పనిరా సామీ!
వాట్ ఏన్ ఐడియా టీచర్ జీ.. అగ్గిపెట్టెలతో అటెండెన్సా!

