ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!

Updated on: Jul 22, 2026 | 4:50 PM

బహిరంగంగా మూత్రవిసర్జన చేయడం, చెత్త వేయడం అరికట్టేందుకు అస్సాంలోని టిన్సుకియా మున్సిపల్ బోర్డు వినూత్న నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫొటోలను సీసీటీవీ ఆధారంగా నగరంలోని ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శించనుంది. ప్రజల్లో పౌర బాధ్యత పెంచడమే లక్ష్యమని అధికారులు చెబుతుండగా, ఈ చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేసేవారికి, చెత్త వేసేవారికి చెక్ పెట్టేందుకు అస్సాంలోని టిన్సుకియా మున్సిపల్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి, ఎవరైనా బహిరంగంగా మూత్రవిసర్జన చేసినా లేదా చెత్త వేసినా వాటిని రికార్డ్ చేస్తారు. ఆ దృశ్యాల ఆధారంగా సదరు వ్యక్తుల ఫొటోలను నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తారు. ఈ ‘హాల్ ఆఫ్ షేమ్’ ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రచారానికి సంబంధించి మున్సిపల్ బోర్డ్ ఛైర్మన్ పులోక్ చెటియా రియాక్ట్ అయ్యారు. ఎవరినీ అవమానించడం తమ ఉద్దేశం కాదని, ప్రజల్లో ప్రవర్తనా మార్పు కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి అవగాహన కల్పించినా, ఉచిత మరుగుదొడ్లు అందుబాటులో ఉంచినా మార్పు రాకపోవడంతోనే ఈ పద్ధతిని ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ వినూత్న విధానాన్ని రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవోరా ప్రశంసిస్తూ, ముంబై వంటి మెట్రో నగరాల్లోనూ దీనిని అమలు చేయాలని సూచించారు. కాగా, స్థానికులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, మరిన్ని ప్రజా మరుగుదొడ్లను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. పౌర స్పృహ పెంచేందుకు ఈ చర్య దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!

కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!

Social Media Effect: లైక్స్‌ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

Boy Friend For Rent: గంటల లెక్కన అద్దెకు ప్రియుడు!..సోషల్‌ మీడియాలో సరికొత్త ట్రెండ్

Loading...
Unable to load recommendations.
Follow Us