Paytm: ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం పనిచేస్తుందా ?? లేదా ??
హోటల్ కు వెళ్తే పేటీఎం. షాపింగ్ కు వెళ్తే పేటీఎం. ఆఖరికి కూరగాయల మార్కెట్ కు వెళితే పేటీఎం. చివరకు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా.. పేటీఎం. 2016లో ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిందో.. అప్పటి నుంచి దీని దశ తిరిగింది. అందరి నోళ్లలో నానింది. అందరి మొబైల్స్ లో చేరింది. క్రమంగా ట్రాన్జాక్షన్స్ పెరిగాయి. కానీ ఏం లాభం.. పెరుగుట విరుగుట కొరకే అన్న పాత మాటను నిజం చేసిందా అని.. దీని కథ విన్న ఎవరికైనా అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి పెద్ద సంస్థకు ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించరు.
హోటల్ కు వెళ్తే పేటీఎం. షాపింగ్ కు వెళ్తే పేటీఎం. ఆఖరికి కూరగాయల మార్కెట్ కు వెళితే పేటీఎం. చివరకు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా.. పేటీఎం. 2016లో ఎప్పుడైతే పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడిందో.. అప్పటి నుంచి దీని దశ తిరిగింది. అందరి నోళ్లలో నానింది. అందరి మొబైల్స్ లో చేరింది. క్రమంగా ట్రాన్జాక్షన్స్ పెరిగాయి. కానీ ఏం లాభం.. పెరుగుట విరుగుట కొరకే అన్న పాత మాటను నిజం చేసిందా అని.. దీని కథ విన్న ఎవరికైనా అనిపిస్తుంది. నిజానికి ఇలాంటి పెద్ద సంస్థకు ఈ పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించరు. 2021లో ఆర్బీఐ హెచ్చరించినప్పుడే జాగ్రత్త పడుంటే సీన్ ఇక్కడి వరకు వచ్చేది కాదు. మరిప్పుడు పరిస్థితి చేయిదాటిపోయిందా? ఇంతకీ ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం పనిచేస్తుందా? లేదా? పేటీఎం పరిస్థితి ఏమిటి? దేశంలో ఏ ఇద్దరు కామన్ మ్యాన్ కలుసుకున్నా ఒకరినొకరు అడిగే ప్రశ్న ఇదే. వారికి పేటీఎం మనీ ల్యాండరింగ్, కేవైసీ ఉల్లంఘన, పేటీఎం వ్యాలెట్.. పేమెంట్స్ బ్యాంక్ మధ్య నడిచిన అక్రమ లావాదేవీలు.. ఇవేవీ తెలియదు. వాళ్లకు తెలిసిందల్లా.. ఏదైనా కొంటే పేటీఎం ద్వారా చెల్లించడమే. దానికోసం అది ఫిబ్రవరి 29 తరువాత పనిచేస్తుందా లేదా అన్నదే కావాలి. కానీ ఇదిప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నే అయ్యింది. ఎందుకంటే పేటీఎం భవిష్యత్తు.. ఆర్బీఐ నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఇంతకీ పేటీఎంకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటి? దీనికి బాధ్యులెవరు? ఈ సవాల్ ను పేటీఎం ఎలా స్వీకరిస్తుంది? మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చుకోగలుగుతుందా?
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్య వీధుల్లో సుందర దృశ్యం.. పులకించి పోయిన రామ భక్తులు
ఏనుగు లైట్ తీసుకుంది గానీ.. లేదంటే చుక్కలే
Donald Trump: చేతిపై ఎర్రని మచ్చలు.. ట్రంప్ కు ఏమైంది ??
భార్య సాయంతో తండ్రిగా మారిన ట్రాన్స్‌జెండర్
‘సారీ.. మీ బాధ ఎవరికీ రాకూడదు’ తల్లితండ్రుల క్షమాపణ కోరిన జుకర్‌బర్గ్
