ఆధార్‌పై కీలక అప్‌డేట్.. దాని కోసం QR కోడ్ తప్పని సరి
ఉడాయ్ ఆధార్ జిరాక్స్ సేకరణకు అడ్డుకట్ట వేసింది. హోటళ్లు, సంస్థలు ఉడాయ్ వద్ద రిజిస్టర్ అయి, QR కోడ్ లేదా ఆధార్ యాప్ ద్వారా మాత్రమే ధృవీకరించాలి. రిజిస్ట్రేషన్ లేని సంస్థలు ఆధార్ ఫోటోకాపీలు అడగడం చట్టవిరుద్ధం. ఇది వినియోగదారుల గోప్యతకు భద్రత కల్పిస్తుంది. ఎడాపెడా ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరించే పద్ధతికి ఉడాయ్ ఇక చెక్ పెట్టబోతోంది.
ఎడాపెడా ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరించే పద్ధతికి ఉడాయ్ ఇక చెక్ పెట్టబోతోంది. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ సంస్థలు ఉడాయ్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ లేని ఏ సంస్థకు కూడా ఆధార్ ఫోటోకాపీలు తీసుకునే అధికారం లేదని హెచ్చరించింది. ఆధార్ కార్డుల ధృవీకరణకు కొత్త టెక్నాలజీని ప్రవేశ పెడుతున్నట్లు ఉడాయ్ సీఈవో భువనేశ్ కుమార్ తెలిపారు. ఇక నుంచి సంస్థలు వినియోగదారుల ఆధార్‌ను QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా గానీ, కొత్త ఆధార్ యాప్ ద్వారా గానీ ధృవీకరించాలని అన్నారు. వ్యక్తుల ఆధార్ జిరాక్స్ లను అడగడానికి పర్మిషన్ లేదని, ఆ పద్ధతిని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఏ సంస్థకైనా ప్రత్యేక కారణాల వల్ల నిజంగానే ఆధార్ కాపీలు అవసరం అయితే.. వారు తప్పనిసరిగా ఉడాయ్ వద్ద రిజిస్టర్ కావాల్సి ఉందన్నారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఆధార్ జిరాక్స్ సేకరణ పూర్తిగా అక్రమం అని క్లారిటీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vande Bharat: డిసెంబర్లో కూత పెట్టనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి.. వెంబడించిన వీధి శునకం.. చివరికి..!
2025లో గూగుల్‌ను ఊపేసిన టాప్ 10 సినిమాలివే
షూటింగ్ అప్‌డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నారో తెలుసా
చైనా అమ్మాయి వెడ్స్ ఝార్ఖండ్ అబ్బాయి.. వీరి అద్భుత ప్రేమ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే