Fastag – GPS: ఇకపై ఫాస్ట్‌ట్యాగ్‌లు పనిచేయవు.! కారణం ఇదే..
టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, త్వరితగతిన పేమెంట్స్ పూర్తి చేయడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలు చేశారు. అయితే ఈ విధానాన్ని ఇప్పడు కేంద్ర ప్రభుత్వం నిలిపివేయనుందా అంటే.. అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే.. త్వరలో ఫాస్ట్‌ట్యాగ్ ప్లేస్‌లో GPS బేస్డ్ విధానం అమలులోకి రానుంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్‌ను ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, త్వరితగతిన పేమెంట్స్ పూర్తి చేయడానికి ఫాస్ట్‌ట్యాగ్ విధానం అమలు చేశారు. అయితే ఈ విధానాన్ని ఇప్పడు కేంద్ర ప్రభుత్వం నిలిపివేయనుందా అంటే.. అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే.. త్వరలో ఫాస్ట్‌ట్యాగ్ ప్లేస్‌లో GPS బేస్డ్ విధానం అమలులోకి రానుంది. జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టెమ్‌ను ఏప్రిల్ నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో 2024 లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి, ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి రానుంది. అంతకంటే ముందే దేశంలో ఈ GPS బేస్డ్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టెమ్‌ను అమలులోకి తీసుకురావడానికి నితిన్ గడ్కరీ కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కన్సల్టెంట్‌ను కూడా నియమించినట్లు సమాచారం.
2021లో ఫాస్ట్‌ట్యాగ్ అమల్లోకి వచ్చింది, అప్పటి నుంచి ప్రతి వాహననానికి తప్పనిసరిగా ఫాస్ట్‌ట్యాగ్ ఉండాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం దాదాపు అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత టోల్ వసూళ్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ తరువాత వీటన్నింటిని దశల వారీగా తొలగించనున్నట్లు చెబుతున్నారు. GPS విధానం అమలులోకి వచ్చిన తరువాత ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నీషన్ సిస్టెమ్ ద్వారా టోల్ కట్ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం శాటిలైట్‌తో ముడిపడి ఉంటుంది. టోల్ విషయంలో కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో కొత్త సిస్టం అమలుచేయడానికి కేంద్రం సిద్ధమైంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..