పాత బ్యాంకు ఖాతాలలో డబ్బు మర్చిపోయారా ?? అయితే ఈ విధంగా చేయండి
ఈ రోజుల్లో చాలామందికి రెండు, మూడు బ్యాంక్ అకౌంట్లు ఉంటున్నాయి. సేవింగ్స్ కోసం ఒకటి, రెగ్యులర్ గా వాడేందుకు మరొకటి ఇలా డివైడ్ చేసుకుంటున్నారు. ఇక ఉద్యోగులకైతే చెప్పనక్కర్లేదు.. ఒక్కో కంపెనీలో ఒక్కో బ్యాంకుకు చెందిన శాలరీ అకౌంట్ ఉండటంతో.. కంపెనీ మారినప్పుడల్లా ఒక్కో ఖాతా ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
శాలరీ, స్కాలర్ షిప్, వ్యక్తిగత అవసరాల కోసం వివిధ బ్యాంక్ అకౌంట్స్ ఉండటం సాధారణమే. కొందరు కొంతకాలానికి ఆ అకౌంట్లలో డబ్బును తీయకుండా మర్చిపోతుంటారు. పదేళ్లకు పైగా అకౌంట్ నుంచి లావాదేవీలు జరగకపోతే.. ఆ ఖాతాల్లోని నిధులు ఆర్బీఐ కు చెందిన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్ నెస్ ఫండ్ కు చేరవచ్చు. కానీ ఆ డబ్బును తిరిగి పొందవచ్చునని ఆర్బీఐ తెలిపింది. ఇందుకోసం బ్యాంక్ కు చెందిన ఏదైనా బ్రాంచ్ కు వెళ్లి.. ఆధార్, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లో ఏదైనా గుర్తింపు కార్డును చూపించి కేవైసీని పూర్తి చేయాలి. మీ బ్యాంక్ ఖాతాను అక్కడి అధికారులు ధృవీకరించిన తర్వాత మీ డబ్బును వడ్డీతో సహా తిరిగి పొందవచ్చు. ఈ ప్రాసెస్ పై పూర్తి సమాచారం కోసం దేశవ్యాప్తంగా డిసెంబర్ వరకు అన్ని జిల్లాల్లో జరుగుతున్న అన్ క్లెయిమ్డ్ ఆస్తులపై ఆర్బీఐ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తుంది. క్లెయిమ్ చేయని డిపాజిట్ల గురించి తెలుసుకునేందుకు బ్యాంక్ వెబ్ సైట్లో లేదా 30 బ్యాంకుల సమాచారం ఉన్న udgam.rbi.org.in పోర్టల్ ను సందర్శించాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సాఫ్ట్‌వేర్ కొలువుల ఊచకోత.. లక్ష దాటిన తొలగింపులు
ఇది కదా సాయం అంటే.. తల్లి వర్థంతి వేళ.. రైతుల అప్పులు తీర్చాడు
TOP 9 ET News: ‘శభాష్ రామ్ చరణ్! మంచి నిర్ణయం తీసుకున్నావ్..’
