సేవింగ్స్ అకౌంట్‌కు FD లింక్‌ చేస్తే అధిక వడ్డీ.. అందుబాటులోకి తెచ్చిన కొన్ని బ్యాంకులు

Updated on: Jul 18, 2025 | 8:06 PM

మీ అవసరాలకు పోనూ ఉన్న మిగులు డబ్బును సేవింగ్స్ ఖాతాలోనే ఉంచుకోవటమా లేదా దానిని ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయటం మంచిదా?.. అనే సందేహం చాలామందికి ఉంటుంది. అందుకే.. ఆర్బీఐ స్వీప్-ఇన్ FD అనే ఛాయిస్‌ను అందిస్తోంది. దీనివల్ల.. సేవింగ్స్ ఖాతా ప్రయోజనాలతో బాటు FD ఇచ్చే లాభాలూ మదుపుదారులకు అందనున్నాయి.

కొన్ని బ్యాంకులు అందుబాటులోకి తెచ్చిన ఆ ఫీచర్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. మన సేవింగ్ అకౌంట్‌లోని మిగులు డబ్బును అలా వదిలేయటం వల్ల ఎలాంటి వడ్డీ రాదు. అలాగని FD చేద్దామా.. అంటే, ఎప్పుడు ఏ అవసరం పడుతుందో తెలీదు. తీరా FD చేశాక, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే.. FD రద్దు చేయాలి. దీనివల్ల వడ్డీ నష్టపోతున్నామనే బాధ తప్పదు. అందుకే.. సేవింగ్ అకౌంట్‌ను FD తో అనుసంధానం చేస్తూ.. ఆర్బీఐ… స్వీప్-ఇన్ FD అనే ఆప్షన్‌ను అందిస్తోంది. దీనివల్ల సాధారణ పొదుపు ఖాతాతో పోలిస్తే మీకు మెరుగైన వడ్డీ రావటమే గాక.. అత్యవసర అవసరాలకు అవసరమైన డబ్బును సేవింగ్ అకౌంట్ లోకి మళ్లించుకుని వాడుకోవచ్చు. సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంకు బ్రాంచ్ లోనే స్వీప్-ఇన్ FDని చేసుకోవచ్చు. స్వీప్-ఇన్ FD కాలపరిమితి.. ఒక సంవత్సరం నుండి 5 ఆర్థిక సంవత్సరాల వరకు ఉంటుంది. సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ మీద వచ్చే దాని కంటే ఎక్కువ వడ్డీ రేటు వస్తుంది.మీ డిపాజిట్లు గడువు ముగిసినప్పుడు, బ్యాంక్ ఆటోమెటిక్‌గా అసలు మొత్తాన్ని, పెరిగిన వడ్డీని మీకు అందిస్తుంది. మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే, మీరు ఈ FD నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు, తర్వాత దాన్ని తిరిగి ఫిల్‌ చేయవచ్చు. నిర్ణీత గడువులోగా ఆ డబ్బును తిరిగి డిపాజిట్ చేయాలి. దీనివల్ల మీకు ఎలాంటి ఫైన్‌ పడదు. ఉదాహరణకి మీరు మీ సేవింగ్ అకౌంట్‌లో ఇప్పుడు ఒక లక్షరూపాయలున్నాయి. అయితే, మీ నెల వారీ ఖర్చుకు రూ. 50 వేలుంటే చాలు అనుకుంటే.. ఆ మిగిలిన 50 వేలు స్వీప్-ఇన్ FDలో మార్చుకోవచ్చు. ఇప్పుడు.. సేవింగ్ ఖాతాలోని 50 వేల మీద మీకు 2.5 శాతం నుంచి 2.75 శాతం వడ్డీ, స్వీప్-ఇన్ FDలోని 50 వేల మీద 5.5 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఒకవేళ.. మీరు ఏదైనా అవసరమై.. సేవింగ్ ఖాతాలోని 50 వేలలో ఓ 30 వేలు తీసి వాడుకున్నారని అనుకుందాం. అప్పుడు.. ఆటోమేటిక్‌గా మీ స్వీప్-ఇన్ FDలో నుంచి రూ. 20 వేలు సేవింగ్‌లోకి మారతాయి. దీనివల్ల మీ కుటుంబ అవసరాలకి తగిన మినిమం ఎమౌంట్ సేవింగ్స్‌లో రెడీ గా ఉంటుంది. ఒకవేళ.. ఏదైనా ఆదాయం వచ్చి.. మీరు బ్యాంకులో మరో 50 వేలు డిపాజిట్ చేస్తే.. వెంటనే ఆటోమేటిక్‌గా మీ సేవింగ్స్ నుంచి రూ. 50వేలకు పైన ఉన్న మొత్తమంతా స్వీప్-ఇన్ FDలోకి వెళ్లి ఎక్కువ వడ్డీ వస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గూగుల్ సెర్చ్‌లో సరికొత్త మోడ్.. ఇకపై మరింత ఈజీ

ఇదేంటి భయ్యా.. మందు తాగకుండానే పాజిటివ్‌

ఫోన్‌‌ చూసీ.. చూసీ.. యువకుడికి సరికొత్త వ్యాధి.. ఆ సామర్థ్యాన్ని కోల్పోయిన బాధితుడు

ప్రభాస్‌ సినిమాకు OTT దెబ్బ..! రిలీజ్‌ కష్టమేనా?

స్పిరిట్ సినిమాపై అతి తెలివిగా మాట్లాడిన త్రిప్తి