Ola Scooter: మార్కెట్లోకి కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 181 కి.మీ. వరకూ ప్రయాణం.. మేకింగ్ వీడియో..!
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు వాహనదారులు. ఇప్పటికే ఓలాతో పాటు ఇతర కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇక ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు వాహనదారులు. ఇప్పటికే ఓలాతో పాటు ఇతర కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇక ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో స్కూటర్ల తయారీ విధానాన్ని వీడియో ద్వారా ఆయన షేర్ చేశారు.
ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉన్న మహిళా కార్మికులు డెలివరీకి ముందు ఓలా ఎస్ 1 స్కూటర్ ఉత్పత్తి ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. నవంబర్ 10 తేదీ నుంచి ఈ స్కూటర్ల తొలి టెస్ట్ రైడ్లను అందించే యోచనలో ఉంది కంపెనీ. ఈ క్రమంలో నవంబర్ 1వ తేదీ నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ కూడా కంపెనీ తిరిగి ప్రారంభిస్తోంది. ఓలా సీఈఓ అగర్వాల్ ఇటీవల సంస్థ మొదటి హైపర్ ఛార్జర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ మొదటి హైపర్ ఛార్జర్ వద్ద ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ ఇండియాలోని సుమారు 400 నగరాల్లో హైపర్ ఛార్జర్ నెట్ వర్క్ కింద లక్ష ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక ఛార్జింగ్ పాయింట్ల వద్ద 18 నిమిషాల ఛార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నాయని తెలిపారు. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ 1 ప్రోను ఒకసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 181 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.
మరిన్ని చదవండి ఇక్కడ: Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)