UPI New Rules: రోజుకు రూ.10 లక్షలు.. UPI లిమిట్ పెంపు

Updated on: Sep 15, 2025 | 10:36 PM

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యుపిఐ చెల్లింపుల పరిమితిని పెంచింది. భీమా, మార్కెటింగ్, రవాణా వంటి రంగాలలో యుపిఐ చెల్లింపుల పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెరిగింది. క్రెడిట్ కార్డ్ చెల్లింపుల పరిమితి కూడా పెరిగింది. నగల కొనుగోలుకు సంబంధించిన పరిమితి కూడా పెంచబడింది.

భారతదేశంలో యుపిఐ చెల్లింపులు విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. తాజాగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యుపిఐ ద్వారా చేసే చెల్లింపుల పరిమితిని పెంచింది. ఇప్పటి వరకు భీమా, మార్కెటింగ్, రవాణా రంగాలలో రూ. 5 లక్షలు మాత్రమే పరిమితి ఉండగా, ఇప్పుడు రూ. 10 లక్షలకు పెంచారు. ఈ కొత్త నిబంధనలు వెంటనే అమలులోకి వచ్చాయి. అదనంగా, క్రెడిట్ కార్డుల ద్వారా యుపిఐ చెల్లింపుల పరిమితిని రూ. 5 లక్షల నుండి రూ. 6 లక్షలకు పెంచారు. నగలు కొనుగోలు కోసం యుపిఐ ద్వారా చేసే చెల్లింపుల పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 6 లక్షలకు పెంచడం గమనార్హం. ఈ మార్పులు పెద్ద మొత్తంలో లావాదేవీలు చేయాల్సిన వారికి ఉపయోగకరంగా ఉంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Guntur: క్షుద్రపూజల అరిష్టం తొలగిపోవాలంటూ శివుడికి అభిషేకాలు

2047 స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలి

వర్షాల ఎఫెక్ట్ మరోసారి నిలిచిపోయిన ముంబై లో మోనోరైలు

ముషీరాబాద్ లో గల్లంతైన యువకుడి కోసం గాలింపు

యూరియూ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత వాళ్లదే