ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. మీకో షాకింగ్ న్యూస్ !!
ట్రాఫిక్ చలాన్లు చెల్లించని వాహనదారులకు ప్రభుత్వం కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఇకపై పెండింగ్ చలాన్లకు డ్రైవింగ్ లైసెన్స్, వాహనం ఆర్సీ ఫ్రీజ్ అవుతాయి. ఆర్‌టీఏ సేవలు నిలిచిపోతాయి. ఐదుకు మించి చలాన్లు ఉంటే లైసెన్స్ బ్లాక్ చేస్తారు. ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ అథారిటీ ఏర్పాటు చేస్తున్నారు. వాహనదారులు వెంటనే పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న వాహనదారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించనుంది. ఇకపై పెండింగ్ చలాన్లు ఉంటే కేవలం జరిమానాతో సరిపెట్టకుండా, నేరుగా డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనం ఆర్సీ ని కూడా ఫ్రీజ్ చేసేలా రవాణాశాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉంటే ఆర్‌టీఏ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. జరిమానా చెల్లించిన తర్వాతే మళ్లీ సేవలు యాక్టివ్ అవుతాయి. అంతేకాదు, ఏడాదిలో ఒక వాహనంపై 5 కంటే ఎక్కువ చలాన్లు నమోదైతే, వెంటనే లైసెన్సింగ్ అథారిటీకి అలర్ట్ వెళ్తుంది. ఆ వెంటనే లైసెన్స్ లేదా ఆర్సీని బ్లాక్ చేస్తారు. జరిమానాలపై వచ్చే ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనుంది.దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకట్రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకే ఉల్లంఘనకు రెండుసార్లు ఫైన్ పడటం లేదా వాహనం అమ్మిన తర్వాత కూడా పాత యజమానికి చలాన్లు రావడం వంటి సాంకేతిక సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. ఇక ఫిర్యాదుల గడువు విషయానికి వస్తే.. కెమెరా చలాన్లకు 3 రోజులు, ఫిజికల్ చలాన్లకు 15 రోజులలోపు స్పందించాలి. అభ్యంతరాలు ఉంటే 45 రోజుల్లోపు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. వీటిని 30 రోజుల్లోగా అధికారులు పరిష్కరిస్తారు. ఒకవేళ అధికారుల నిర్ణయంపై అసంతృప్తి ఉంటే, చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించి కోర్టుకు వెళ్లే వెసులుబాటు కూడా కల్పించారు. ట్రాఫిక్ నిబంధనల అమలులో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తెస్తోంది. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండి, పెండింగ్ చలాన్లను వెంటనే క్లియర్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సార్.. నేను బతికే ఉన్నా.. న్యాయం చేయండి !!
పాఠశాల వంటగదిలో వింత శబ్ధాలు.. అక్కడ సీన్ చూసి అంతా..
రైలు భోజనంలో పురుగులు.. కేటరింగ్ కు రూ. 10 లక్షల జరిమానా
కానిస్టేబుల్‌ను వెంటాడి హతమార్చిన తేనెటీగలు
రెస్టారెంట్లకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే ఇక అంతే సంగతులు