ఆదాయం కోట్లలో.. పన్ను కట్టడం రూపాయల్లో
భారత రెస్టారెంట్ పరిశ్రమలో భారీ పన్ను ఎగవేత కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లక్షకు పైగా రెస్టారెంట్లు ఉపయోగించే POS సాఫ్ట్‌వేర్ ద్వారా వినియోగదారుల నుండి వసూలు చేసిన GST మరియు ఆదాయపు పన్నును ప్రభుత్వానికి చెల్లించకుండా 13 వేల కోట్లకు పైగా రూపాయలు మాయం చేసినట్లు ఐటీ దాడుల్లో వెల్లడైంది. ఈ బిల్లింగ్ మాయాజాలంపై దర్యాప్తు ముమ్మరమైంది.
రెస్టారెంట్లలో జరుగుతున్న భారీ పన్ను ఎగవేత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వినియోగదారులు చెల్లించిన జీఎస్టీని, యజమానుల ఆదాయపు పన్నును ప్రభుత్వానికి చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఐటీ దాడుల్లో వెల్లడైంది. లక్షకు పైగా రెస్టారెంట్లు ఉపయోగించే POS సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఈ “బిల్లింగ్ మాయాజాలం” జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఓ బిర్యానీ అవుట్‌లెట్‌లో ఫిబ్రవరి 18, 2026న జరిగిన తనిఖీతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2019-2020 నుంచి 2025-2026 వరకు ఆరేళ్ల కాలంలో సుమారు 2.43 లక్షల కోట్ల విలువైన బిల్లింగ్ జరగగా, అందులో 13,000 కోట్లకు పైగా పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suryapeta: దారుణం.. ప్రేమించి దూరం పెడుతోందని యువతిపై సుత్తితో
Loading...
Unable to load recommendations.
Follow Us