గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. వారికి నో బుకింగ్‌.. నో సిలిండర్‌

Updated on: Mar 18, 2026 | 1:49 PM

వంటగ్యాస్ సరఫరా ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పైప్డ్ నాచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్నవారు తమ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్లను సరెండర్ చేయాలని ఆదేశించింది. అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకాలు, దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మారుమూల ప్రాంతాలు, పేద కుటుంబాలకు గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి.

వంటగ్యాస్ సరఫరాపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో పైప్డ్ నాచురల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గ్యాస్ సరఫరా, పంపిణీ నియంత్రణ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనలు ప్రకారం.. పీఎన్‌జీ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఇకపై ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకోవడానికి వీలుండదు. పైప్డ్ గ్యాస్ సౌకర్యం ఉన్న వారు కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కారు. నిబంధనల ప్రకారం, పీఎన్‌జీ ఉన్నవారు తమ ఎల్పీజీ కనెక్షన్‌ను స్వచ్ఛందంగా డిస్ట్రిబ్యూటర్ వద్ద సరెండర్ చేయాల్సి ఉంటుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీనివల్ల భారత్‌కు ఎల్పీజీ దిగుమతులు తగ్గగా, దేశీయంగా సిలిండర్ల కోసం డిమాండ్ ఏకంగా 60 శాతం పెరిగింది. ప్రజలు ఆందోళనతో ముందస్తు బుకింగ్‌లు చేస్తుండటంతో పంపిణీ వ్యవస్థపై భారం పడింది. ఈ నేపథ్యంలో, పీఎన్‌జీ నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాలకు మరియు పేద కుటుంబాలకు సిలిండర్ల సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో పీఎన్‌జీ వాడుతున్న వారు సహకరిస్తే, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కొరతను నివారించవచ్చని పెట్రోలియం శాఖ భావిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు

ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??

Follow Us