కొత్త ఫ్లాట్‌లు కొనే వారికి అలర్ట్.. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే మీ కొంప కొల్లేరే..!

Updated on: Jun 19, 2025 | 6:23 PM

ఆధునిక జీవనశైలి పెరిగే కొద్దీ అపార్ట్మెంట్లపై ఆకర్షణ కూడా అంతే వేగంగా పెరిగిపోతోంది. ప్రతి కుటుంబం తమ కలల ఇంటి కోసం వేచి చూస్తోంది. కానీ ఆ కలలు నిజం కావాలంటే ఓ కీలకమైన విషయాన్ని తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉంది. అదే ఏంటంటే, మీకు ఆసక్తిగా ఉన్న ఫ్లాట్ లేదా ప్లాట్ ఏపీ రెరాలో నమోదు అయిందా లేదా అన్నది ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకోవాలి.

AP RERA చైర్మన్, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ కీలక హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతి లేకుండా కొన్ని ప్రాజెక్టులు ‘ప్రీ-లాంచ్’ పేరుతో పబ్లిసిటీ చేస్తూ, కస్టమర్ల నుండి ముందస్తు డిపాజిట్లు వసూలు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇది పూర్తిగా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్ చట్టం, 2016కు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. RERA అనేది ఒక ప్రతిష్టాత్మకమైన రెగ్యులేటరీ వ్యవస్థ. ఇది వినియోగదారులను రక్షించడమే లక్ష్యంగా ఏర్పడింది. ఈ చట్టం కింద బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాజెక్టులను RERAలో నమోదు చేయాల్సి ఉంటుంది. అనుమతులు, ఫైనాన్షియల్ స్టేటస్, ప్రాజెక్ట్ డీటెయిల్స్ వంటి విషయాలు పూర్తిగా పరిశీలించాకే వారు మార్కెటింగ్ ప్రారంభించగలుగుతారు.వినియోగదారుల ఫిర్యాదులను RERA స్వయంగా పరిశీలించి చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంది. RERA వెబ్‌సైట్ (https://www.rera.ap.gov.in) ద్వారా ప్రాజెక్ట్ RERA నంబర్, లైసెన్స్ వివరాలు చెక్ చేసుకోవాలి. “ప్రి-లాంచ్” పేరుతో అడిగే డిపాజిట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించవద్దు. పత్రపూర్వక ఒప్పందాలు లేకుండా ఏ డాక్యుమెంట్‌పై సంతకం పెట్టవద్దు. ఒకసారి డబ్బు ఇచ్చాక సమస్యలు వస్తే RERA అధికారికంగా ఫిర్యాదు చేయాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్నేక్ క్యాచర్ ను చూసి హడలెత్తిపోయిన కోడెనాగు.. ఏం చేసిందో తెలుసా..?

మాల్‌లో కుక్కను తెచ్చిన అమ్మాయి.. కుక్కను చూసి జనం షాక్‌