ఐటీ రిఫండ్ ఇంకా మీ ఖాతాలో పడలేదా

Updated on: Oct 08, 2025 | 4:54 PM

2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు ITR దాఖలు చేసే గడువు ముగిసింది. రిటర్నులు ప్రాసెస్ అయినప్పటికీ తమకు ఇంకా రీఫండ్ డబ్బులు రాలేదంటూ చాలామంది పన్ను చెల్లింపుదారులు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో తమ రిటర్ను స్టేటస్ ‘ప్రాసెస్డ్’ అని చూపిస్తున్నా, బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

ఇలాంటి సమస్య ఎదురైతే ఏం చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. సెప్టెంబర్ 16తో గడువు ముగియగా, ఆ తర్వాత కూడా కొందరు రిటర్నులు దాఖలు చేశారు. దీంతో మొత్తం 7.68 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ అయినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. వీటిలో ఇప్పటికే 6.11 కోట్ల రిటర్నులను ప్రాసెస్ చేసినట్లు తెలిపింది. అయినప్పటికీ రీఫండ్ల జారీలో జాప్యం జరుగుతోందని పలువురు వాపోతున్నారు. సాధారణంగా రీఫండ్ ఆలస్యం కావడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉంటాయి. పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌లో నమోదు చేసిన బ్యాంకు ఖాతా వివరాలు తప్పుగా ఉండటం ప్రధాన సమస్య. బ్యాంకు అకౌంట్ నంబర్ లేదా ఐఎఫ్ఎస్‌సీ కోడ్ తప్పుగా ఇస్తే, ఆదాయపు పన్ను శాఖ రీఫండ్‌ను నిలిపివేస్తుంది. సరైన, ధృవీకరించిన బ్యాంకు ఖాతా ఉన్నవారికే రీఫండ్ జారీ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా ఫారం 26ఏఎస్‌లోని టీడీఎస్ వివరాలకు, మీరు ఐటీఆర్‌లో క్లెయిమ్ చేసిన మొత్తానికి మధ్య వ్యత్యాసం ఉన్నా రీఫండ్ ప్రక్రియ ఆగిపోతుంది. ఒకవేళ మీ రీఫండ్ రాకపోతే, ముందుగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయి, ‘రీఫండ్/డిమాండ్ స్టేటస్’ విభాగంలో తనిఖీ చేయాలి. బ్యాంకు వివరాలు తప్పుగా ఉన్నట్లు గుర్తిస్తే, వాటిని సరిచేసి ‘రీఫండ్ రీ-ఇష్యూ’ కోసం అభ్యర్థన పెట్టవచ్చు. అన్ని వివరాలు సరిగ్గా ఉండి, రీఫండ్ జారీ అయినట్లు కోడ్ చూపించినా డబ్బులు రాకపోతే, మీ బ్యాంకు శాఖను లేదా ఎన్ఎస్‌డీఎల్‌ను సంప్రదించాలి. సాధారణంగా రీఫండ్ ప్రక్రియ పూర్తయ్యాక డబ్బులు ఖాతాలో జమ కావడానికి 15 నుంచి 30 రోజుల సమయం పట్టవచ్చు. అందుకే నెల రోజుల వరకు వేచి చూడటం ఉత్తమం. అప్పటికీ రీఫండ్ రాకపోతే ఆదాయపు పన్ను శాఖ అధికారులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

15 మంది భార్యలతో విదేశీ ట్రిప్‌… పేదరికంలో దేశం… రాజు జల్సా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వేలో ఏకంగా 8,850 పోస్టులు భర్తీ

కొన్ని ఘటనలు నన్ను భయపెట్టాయి.. అందుకే పాపకు మాస్క్ వేస్తున్నాం

వారం రోజుల్లో అన్ని ప్రైవేటు కాలేజీలు బంద్‌ కానున్నాయా !! మళ్లీ ఏమైంది

బాక్సాఫీస్ షేక్ చేయడానికి రెడీ అవుతున్న హీరోలు.. షూటింగ్ అప్డేట్స్ ఇవే