Gold Price Today: అయ్యో.. బంగారం మళ్లీ పెరిగిందే

Updated on: Nov 06, 2025 | 6:11 PM

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా ఒకరోజు తగ్గుతూ మరోరోజు పెరుగుతూ వస్తోన్న బంగారం ధర గురువారం మళ్లీ పెరిగింది. వెనిజులా మీద అమెరికా యుద్ధ ప్రయత్నాలు, పలు ఇతర అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక.. గురువారం దేశీయ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.430 మేర ధర పెరిగి, రూ. 1,21,910కు చేరింది.

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా ఒకరోజు తగ్గుతూ మరోరోజు పెరుగుతూ వస్తోన్న బంగారం ధర గురువారం మళ్లీ పెరిగింది. వెనిజులా మీద అమెరికా యుద్ధ ప్రయత్నాలు, పలు ఇతర అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక.. గురువారం దేశీయ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములపై రూ.430 మేర ధర పెరిగి, రూ. 1,21,910కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ.1,11,750 కు చేరింది. కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,64,000 పలుకుతోంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండిధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.రూ.1,22,060, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,900 పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,21,910 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,11,750 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,730, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,500 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,21,910, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,750 గా ఉంది. వెండి కిలో రూ.1,51,000లుగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,21,910 ఉంటే.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,11,750 గా ఉంది. కేజీ వెండి ధర రూ.1,64,000 లుగా ఉంది. ఈ ధరలు ఉదయం 11 గంటల తర్వాత నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

AA22: ఏఏ 22 అప్‌డేట్‌.. బన్నీ కన్ఫార్మ్ చేసినట్టేనా ??

Akshay Kumar: అక్షయ్ డెడికేషన్ గురించి చిన్ని ప్రకాష్ కామెంట్

శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ.. రన్‌వే అవసరం లేని విమానం

టెన్త్‌ అర్హతతో రైల్వే ఉద్యోగం.. రాత పరీక్ష లేకుండానే

అయ్యో..రక్షించేవారే లేరా.. ఏనుగుల ఆక్రందన