Gold Price Today: దిగి వచ్చిన పుత్తడి ధర.. నేడు ఎంతంటే

Updated on: Nov 07, 2025 | 6:24 PM

కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న బంగారం వెండి ధరలు నవంబరు 7 శుక్రవారం మళ్లీ తగ్గాయి. ఈ ఏడాది పండుగ సీజన్‌లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. దీపావళికి ముందు వినియోగదారుల కొనుగోలు డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలు ఈ పెరుగుదలకు కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే.. గత రెండు రోజులుగా మళ్లీ బంగారం ధర తగ్గుతూ వస్తోంది. దేశీయ మార్కెట్లలో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550 తగ్గి, రూ.1,22,020 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.500 తగ్గి రూ.1,11,850కి చేరింది. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.దేశీయ మార్కెట్లలో కేజీ వెండి రూ.1,65,000 గా ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో శుక్రవారం బంగారం, వెండి దరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,22,170, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,030 గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,020 ఉంటే, 22 క్యారెట్ల బంగారం రూ.1,11,850 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,950, ఉంటే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,700 గా ఉంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,020, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,850 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,22,020 ఉంటే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,850 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,65,000 లుగా ఉంది. ఈ ధరలు ఉదయం 11 గంటలకు నమోదైనవి. ఇవి సాయంత్రానికి పెరగవచ్చు, తగ్గవచ్చు. బంగారం కొనడానికి వెళ్లేముందు మరోసారి ధరలు చెక్‌చేసుకుంటే మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్‌ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం

ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు

అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే

క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

దేవుడితోనే ఆటలా… హుండీలో బొమ్మ నోట్లు