Gold Rate Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతో తెలుసా?

Updated on: Aug 18, 2025 | 6:01 PM

గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు, వెండి ధరలు.. సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆగస్ట్‌ 18వ తేదీన దేశీయంగా 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, అదే 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.92,740 ఉంది. ఇక 18 కేరట్ల 10 గ్రాముల ధర రూ.75,880 వద్ద ఉంది. ఇక.. కేజీ వెండి ధర జాతీయ స్థాయిలో 1,17,440 పలుకుతోంది.

గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు, వెండి ధరలు.. సోమవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఆగస్ట్‌ 18వ తేదీన దేశీయంగా 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,170 ఉండగా, అదే 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.92,740 ఉంది. ఇక 18 కేరట్ల 10 గ్రాముల ధర రూ.75,880 వద్ద ఉంది. ఇక.. కేజీ వెండి ధర జాతీయ స్థాయిలో 1,17,440 పలుకుతోంది. ఆల్ టైం రికార్డ్ తో పోల్చి చూస్తే 3వేల తక్కువకి వెండి దిగివచ్చింది. ఆగస్టు 18, సోమవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,01,170 రూపాయిలు ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర రూ. 92,740 రూపాయిలుగా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,16,000 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,320 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.92,890 వద్ద ఉంది. ముంబైలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,01,170 ఉండగా, 22 కేరట్ల 10 గ్రాముల ధర రూ.92,740 వద్ద ఉంది. బెంగళూరు, చెన్నైలలో 24 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.1,01,170గా ఉండగా, 22 కేరట్ల తులం బంగారం ధర రూ.92,740 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం వల్ల బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది. డాలర్ బలంగా ఉన్నప్పుడు, బంగారం ధర పెరిగి, డిమాండ్ తగ్గుతుంది. దీనివల్ల ధరలు తగ్గుతాయి. అమెరికా, రష్యా మధ్య దౌత్య పురోగతి రాబోయే జాక్సన్ హోల్ సమ్మిట్ దృష్ట్యా బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ధరల తగ్గుదల పసిడి మార్కెట్‌లో ఒక సానుకూల సంకేతమని, కనుక వినియోగదారులు రాబోయే పండుగలు, వివాహాల కోసం ఇప్పుడు బంగారం కొనుగోలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వణికించిన తుఫాను.. గంటకు 260 కి.మీ వేగంతో గాలులు