ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఇనాక్టివ్ పీఎఫ్ ఖాతాలలోని క్లెయిమ్ చేయని నిధులను ఆటోమెటిక్‌గా సెటిల్ చేసేందుకు సిద్ధమవుతోంది. కొత్త వ్యవస్థతో, ఖాతాదారులు ఎలాంటి క్లెయిమ్ లేకుండానే తమ ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బు పొందుతారు. ఇది 8 లక్షల ఖాతాలకు వర్తిస్తుంది, మొత్తం ₹5,200 కోట్లు జమ కానున్నాయి. ఇనాక్టివ్ ఖాతాలపై వడ్డీ ఆగుతుంది కాబట్టి, ఈ నిర్ణయం వేల మందికి లబ్ధి చేకూరుస్తుంది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు లబ్ది చేకూర్చే దిశగా కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. చాలా కాలంగా వాడకంలో లేకుండా మూతపడిన పీఎఫ్ ఖాతాల్లోని క్లెయిమ్ చేయని నిధులను ఆటోమెటిక్‌గా సెటిల్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. దీని కోసం ప్రత్యేకంగా ఆటోమేటెడ్ సెటిల్‌మెంట్ వ్యవస్థను తీసుకురానుంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే, ఖాతాదారులు ఎలాంటి క్లెయిమ్ చేసుకోకపోయినా, వారి ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లోకి నిధులు నేరుగా జమ అవుతాయి. నివేదికల ప్రకారం, తొలి దశలో భాగంగా ఆధార్ వెరిఫై అయిన సుమారు 8 లక్షల ఇన్‌యాక్టివ్ ఖాతాలను ప్రాసెస్ చేయనున్నారు. ఈ ఖాతాల్లో దాదాపు రూ.5,200 కోట్ల నిధులు ఉన్నట్లు అంచనా. వీటిలో 14,000 ఖాతాల్లో రూ. 5 లక్షలకు పైగా, 38,000 ఖాతాల్లో రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఉద్యోగి 55 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేసిన తర్వాత, వరుసగా మూడేళ్లపాటు ఆ ఖాతాలోకి ఎలాంటి కంట్రిబ్యూషన్ రాకపోతే దానిని ‘ఇన్‌యాక్టివ్’ ఖాతాగా పరిగణిస్తారు. ఇలాంటి ఖాతాలపై వడ్డీ జమ కావడం ఆగిపోతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి 31 లక్షల ఖాతాల్లో రూ. 10,181 ఉన్నట్లు ఈపీఎఫ్ఓ గుర్తించింది. వీటిలో కొన్ని 20 ఏళ్లకు పైబడిన పాత ఖాతాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వెయ్యి రూపాయల లోపు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలను ఆటోమేటిక్‌గా సెటిల్ చేసేందుకు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం తెలిపింది. ఇప్పుడు దీనిని పెద్ద మొత్తాలకు కూడా వర్తింపజేయనున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును ఈపీఎఫ్ఓ ఇప్పటికే ఖరారు చేసింది. అయితే ఈ నివేదికలపై ఈపీఎఫ్ఓ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం