అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

Updated on: Feb 27, 2026 | 9:19 PM

మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముంబైలోని రూ.3,716 కోట్ల విలువైన నివాసాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంక్ మోసం ఆరోపణల విచారణలో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే రూ.12,000 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు వేగవంతం కాగా, టీనా అంబానీకీ సమన్లు అందాయి.

మనీలాండరింగ్‌ కేసులో అనిల్‌ అంబానీకి మరో షాక్ తగిలింది. ముంబయిలోని రూ.3,716 కోట్ల నివాసాన్ని ఈడీ అటాచ్ చేసింది. అనిల్ అంబానీ కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంకు మోసం ఆరోపణల కేసు విచారణలో ఈ భవనాన్ని జప్తుచేయడానికి తాత్కాలిక ఉత్తర్వు జారీ అయింది. ముంబయిలోని పాలి హిల్ సమీపంలో అనిల్ అంబానీ నివాసం 17 అంతస్తులతో 66 మీటర్ల ఎత్తైన భవనం. ఈ కేసులో ఇది వరకే ఒకసారి ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆగస్టు 2025లో ఆయన స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డు చేసింది. సుప్రీంకోర్టు సూచనలతో అనిల్ ధిరూభాయ్ అంబానీ గ్రూప్‌పై వచ్చిన బ్యాంకు మోసం, ఆర్థిక అవకతవకలపై దర్యాప్తునకు ప్రత్యేక బృందాన్ని ఈడీ ఏర్పాటుచేసింది. విచారణలో భాగంగా ఇప్పటి వరకూ ఈ కేసులో రూ.12 వేల కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసి, మూడు ఎఫ్ఐఆర్‌లు ఫైల్ చేసింది. అయితే, కేసు విచారణలో దర్యాప్తు సంస్థల జాప్యంపై గతవారం సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. దర్యాప్తును వేగవంతం చేయాలని ఈడీ, సీబీఐను ఆదేశించింది. విచారణ సమయంలో కోర్టు అనుమతి లేకుండా తాను విదేశీ పర్యటనకు వెళ్లనని అంబానీ హామీ ఇచ్చారు. అనిల్ భార్య టీనా అంబానీకి కూడా సమన్లు జారీ అయ్యాయి. గతవారం ఆమె ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. న్యూయార్క్‌లో విలాసవంతమైన భవనం కొనుగోలు కేసులో ఆమెకు సమన్లు జారీ చేశారు. RCOM మాజీ ఎగ్జిక్యూటివ్ పునీత్ గార్గ్‌ను అరెస్టు చేసిన ఈడీ.. 2023లో ఆ ఆస్తిని మోసపూరితంగా విక్రయించిందని తెలిపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే

అర్థరాత్రి ‌రైడ్‌తో వణుకు పుట్టించిన మహిళా ఎమ్మెల్యే

వామ్మో పెద్దపులి.. వణుకుతున్న మన్యం

అర్ధరాత్రి లాడ్జిలో మంటలు.. 33 మంది..

గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..

Loading...
Unable to load recommendations.
Follow Us