Dry Fruit Price: యుద్ధం ఎఫెక్ట్‌.. ఆకాశాన్నంటుతున్న డ్రైఫ్రూట్స్‌ ధర

Updated on: Mar 05, 2026 | 12:19 PM

గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతల వల్ల ఇరాన్ ఓడరేవులు మూతపడటంతో భారత్‌కు డ్రై ఫ్రూట్స్ సరఫరా నిలిచిపోయింది. పిస్తా, అంజీర్, ఖర్జూరం ధరలు ఏలూరు, తణుకు మార్కెట్లలో భారీగా పెరిగాయి. పండుగల వేళ డిమాండ్ పెరగడం, సరఫరా తగ్గడంతో సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. యుద్ధం కారణంగా ఇరాన్ ఓడరేవులు మూతపడటంతో భారత్‌కు రావాల్సిన డ్రై ఫ్రూట్స్ సరఫరా నిలిచిపోయింది. దీని ప్రభావం ఏలూరు, తణుకు మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పిస్తా, అంజీర్, ఖర్జూరం ధరలు భారీగా పెరిగాయి. రానున్న వారాల్లో మరింతగా ధరలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో కేజీ రూ.2000లు పలికిన పిస్తా ధర ఇప్పుడు రూ.2,200లు పలుకుతోంది. కేజీ పిస్తా సాల్ట్‌ రూ.1100 నుంచి రూ.1300లకు పెరిగింది. అన్నిరకాల డ్రైఫ్రూట్స్‌ ధరలు ఇప్పటికే పెంచి అమ్ముతున్నారు వ్యాపారులు. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, చాబహార్ ఓడరేవులు మూసివేయడంతో సముద్ర మార్గం ద్వారా జరగాల్సిన దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. మరోవైపు భారత్-పాక్ ఉద్రిక్తతల వల్ల అఫ్ఘానిస్థాన్ నుండి రావాల్సిన సరుకుపై కూడా ప్రభావం పడింది. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో పాటు ఉగాది, శ్రీరామనవమి పండుగలు దగ్గర పడుతుండటంతో డ్రై ఫ్రూట్స్ డిమాండ్ పెరిగింది.సరఫరా తక్కువగా ఉండటం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో హోల్‌సేల్ వ్యాపారులు ధరలను పెంచేశారు. రానున్న రోజుల్లో ఈ ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాన్-వెజ్ వంటలు, జ్యూస్ సెంటర్లలో వీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో సామాన్యులు డ్రై ఫ్రూట్స్ కొనాలంటేనే భయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మ్యారేజెస్‌ తగ్గాయి.. ప్రెగ్నెన్సీలు పెరిగాయి.. కారణం ఆ ఒక్క దానివల్లే

EPFO: పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖరారు..

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగులో రైతు వినూత్న ప్రయోగం !!

పంట పొలంలో ఉన్నట్టుండి ఏర్పడిన 20 అడుగుల భారీ గొయ్యి.. దగ్గరకు వెళ్లి చూడగా

Viral Video: రివర్స్ గేర్.. పామునే నోటకరిచిన కప్ప !! ప్రకృతి వైపరీత్యం

Follow Us