విదేశీ బ్రాండ్లు ఇక మన లోకల్ మార్కెట్ ధరలకే

Updated on: Jan 27, 2026 | 5:20 PM

భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరింది. ఈ ఒప్పందం కుదిరితే యూరప్ నుండి దిగుమతయ్యే కార్లు, ఇతర లగ్జరీ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుతాయి. ప్రస్తుతం 70-110% ఉన్న పన్నులు 40% వరకు తగ్గించే అవకాశం ఉంది. ఇది మధ్యతరగతి భారతీయులకు విదేశీ బ్రాండ్లను మరింత చేరువ చేస్తుంది.

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే, భారతీయ మార్కెట్‌లో విదేశీ, ముఖ్యంగా యూరోపియన్ బ్రాండ్ల ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గుతాయని అంచనా. ప్రస్తుతం యూరప్ నుంచి దిగుమతయ్యే కార్లపై భారతదేశం 70 నుంచి 110 శాతం వరకు భారీ సుంకాలు విధిస్తోంది. బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, సోషల్ వెల్ఫేర్ సర్ఛార్జ్, ఐజీఎస్టీ వంటి వివిధ పన్నులతో యూరప్‌లో 30 లక్షల విలువైన కారు భారతదేశంలోకి వచ్చేసరికి 70 లక్షల వరకు ధర పలకడం జరుగుతోంది. ఈ అధిక పన్నుల కారణంగా మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్ల విక్రయాలు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kethireddy Venkatarami Reddy: ఎన్ని కేసులు పెడితే అంత ఉత్సాహంతో పోరాటం చేస్తాం

ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే మూగబోయాను.. కూచిపూడి నర్తకి దీపికా రెడ్డి

నానమ్మను చూసేందుకు వచ్చి కానరాని లోకాలకు

అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు

కాశీ విశ్వనాధ్‌ ఆలయంలో రిపబ్లిక్‌ డే శోభ