దూర ప్రయాణమనగానే ఎక్కువ మంది ఓటేసేది రైళ్లకే. తక్కువ ఖర్చుతో రైలులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. అయితే ఒక్కోసారి రైలు టికెట్‌ను రిజర్వేషన్ చేసుకున్నా సరే, ఆ సీట్లో ఎవరో వేరేవారు కూర్చుని ఉంటారు. సీటు ఖాళీ చేయాలని ఎంత చెప్పినా ఒప్పుకోరు. దీంతో వారితో మీరు గొడవ పడాల్సి వస్తుంది. అయితే ఎలాంటి గొడవలు, ఘర్షణలు లేకుండా, చాలా ఈజీగా మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటును పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటుపై ఇంకెవరైనా కూర్చుంటే, రైల్వే శాఖకు ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చు. ట్రైన్‌లోని సమస్యలపై ఫిర్యాదు చేయడానికి రైల్ మదద్ అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఓ టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. ముందుగా మనం ఆన్ లైన్లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మీరు రైల్ మదద్ వైబ్‌సైట్ ఓపెన్ చేయాలి. వైబ్ సైట్లో మీ రైలు పేరు, పీఎన్ఆర్ నంబర్, సీటు నంబర్ ఎంటర్ చేయాలి. అంతే సింపుల్! మీరు చేసిన ఫిర్యాదు వెంటనే రైల్వే శాఖకు అందుతుంది. వారు తగిన చర్యలు తీసుకుని మీ సీటును మీకు ఇప్పిస్తారు. మీరు కావాలనుకుంటే, కంప్లైంట్ స్టేటస్‌ను కూడా ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటు ఉంది. ఆన్లైన్లో ఫిర్యాదు చేయలేనివారు, రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 139కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వవచ్చు. మీరు 139కు కాల్ చేసిన తరువాత, కస్టమర్ సర్వీస్ ఏజెంట్‌కు మీ ట్రైన్ పేరు, పీఎన్ఆర్ నంబర్, సీట్ నంబర్ వివరాలు తెలియజేయాలి. వెంటనే రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకుని, మీ రిజర్వ్డ్ సీటును మీకు ఇప్పిస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mamitha Baiju: మమితాను ఉక్కిరి బిక్కిరి చేసిన ఫ్యాన్స్ దెబ్బకు దడుసుకుంది పో
రిజల్ట్ బయటికి వచ్చిన వేళ ఏపీ బాట పట్టిన స్టార్ డైరెక్టర్
శ్రద్ధా చేసిన ఒక్క కామెంట్.. ప్రభాస్ మంచితనాన్ని మరో సారి బయటపెట్టిందిగా
దళపతి సినిమాకు కొత్త కష్టం.. ఈ స్టార్ ధాటికి వణుతున్న ప్రొడ్యూసర్స్
వీడియోలో ఏడ్చి రచ్చ చేసింది.. పోలీసోళ్లను తింగరోళ్లను చేసింది.. ఎంతైనా గ్రేట్ పో