Blinkit: బ్లింక్ ఇట్ ఐడియా అదిరిపోయిందిగా !!
దుస్తులు, పాదరక్షలు కొనుగోలు చేశాక ఫిట్టింగ్ విషయంలో చాలా మంది ఇబ్బందిపడుతుంటారు. సరైన సైజ్ కాకపోయినా రంగు నచ్చకపోయినా రిటర్న్ చేయాలనుకుంటారు. వారి కోసమే బ్లింకిట్ యాప్ రిటర్న్, ఎక్స్ఛేంజ్ సుదపాయం తీసుకొచ్చింది. దుస్తులు, పాదరక్షలకు 10 నిమిషాల్లోనే రిటర్న్, ఎక్స్ఛేంజ్ చేసే సదుపాయం తీసుకొచ్చింది. ఇప్పటివరకు 10 నిమిషాల్లోనే డెలివరీలు అందిస్తున్న సంస్థ..
తాజాగా రిటర్నులు, ఎక్స్ఛేంజ్ సదుపాయాలను అందిస్తుంది. ఈ సేవల్ని కూడా కేవలం 10 నిమిషాల్లోనే అందించనున్నట్లు తెలిపింది. బ్లింకిట్‌లో ఈజీ రిటర్నులు తీసుకొచ్చినట్లు కంపెనీ సీఈఓ అల్బిందర్ దిండ్సా ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. కొన్ని వారాలుగా ఈ సేవల్ని ఢిల్లీలో పరీక్షించినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ టెస్ట్ డ్రైవ్ విజయవంతం కావడంతో ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, పుణె.. నగరాల్లో ఈ సేవల్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సేవల్ని విస్తరించనున్నట్లు చెప్పా రు. రిటర్నులు, ఎక్స్ఛేంజ్‌లను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ సేవలను ప్రవేశపెట్టినట్లు బ్లింకిట్ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చాట్‌జీపీటీ సాయంతో సీవీ.. చూసి షాకైన సీఈఓ
22 ఏళ్లుగా ఇలాగే ఉన్నారు.. ఇంకా ఎన్నాళ్లిలా ??
సిడ్నీ బీచ్‌లో వింత ఘటన.. బీచ్ మూసివేత..
CPR Training: హార్ట్ స్ట్రోక్ వస్తే పిల్లలకు..పెద్దలకు ఫస్ట్ ఎయిడ్ ఎలా చెయ్యాలి