Special Trains: అయోధ్యకు ఏపీ, తెలంగాణ నుంచి ప్రత్యేక రైళ్లు

|

Jan 23, 2024 | 4:58 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్-అయోధ్య మధ్య నడిచే రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా ప్రయాణిస్తాయి. విజయవాడ నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్టణం, విజయవాడ, శ్రీకాకుళంరోడ్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని రైల్వే తెలిపింది..

అయోధ్య రామమందిరాన్ని కనులారా వీక్షించాలనే భక్తులకు రైల్వే గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్-అయోధ్య మధ్య నడిచే రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా ప్రయాణిస్తాయి. విజయవాడ నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్టణం, విజయవాడ, శ్రీకాకుళంరోడ్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని రైల్వే తెలిపింది.

సికింద్రాబాద్-అయోధ్య రైళ్లు ఈ నెల 29 నుంచి రోజువిడిచి రోజు బయలుదేరుతాయి. అంటే జనవరి 31, ఫిబ్రవరి 2, 5, ఇలా రోజు విడిచి రోజు ఫిబ్రవరి 25వ తేదీ వరకూ నడుస్తాయి. అలాగే విజయవాడ నుంచి ఫిబ్రవరి 4వ తేదీన, గుంటూరు నుంచి జనవరి 31న రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న, సామర్ల కోట నుంచి ఫిబ్రవరి 11న అయోధ్యకు బయలుదేరుతాయి. మరీ ఈ రైళ్లు సమయ వేళలు తెలియాలంటే ఈ వీడియో చూడండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Published on: Jan 23, 2024 04:57 PM