Aadhaar: ఈ కార్డు మీ దగ్గర ఉందా? అన్నింటికీ ఆధారం అదే! ఈ అప్ డేట్ మిస్సవ్వద్దు!

Updated on: May 30, 2026 | 11:17 AM

2009లో ప్రారంభమైన ఆధార్ ప్రాజెక్టు నేడు భారత డిజిటల్ వ్యవస్థకు వెన్నెముకగా మారింది. బ్యాంకింగ్, సబ్సిడీలు, విద్య, ఆరోగ్య సేవల వరకు ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. బాల్ ఆధార్, విద్యార్థుల బయోమెట్రిక్ అప్‌డేట్లు, ఆన్‌లైన్ సేవలు, కొత్త ఆధార్ యాప్‌లోని అధునాతన భద్రతా ఫీచర్లతో ఆధార్ సేవలు మరింత ఆధునికంగా మారాయి.

భారతదేశంలో నేడు ‘ఆధార్’ లేనిదే ఏ పనీ చేయలేని పరిస్థితి వచ్చింది. కేవలం ఒక గుర్తింపు కార్డుగా ప్రారంభమైన ఆధార్, నేడు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా మారింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్‌ను నిలిపివేసి, సరికొత్త యాప్‌ను తీసుకురావడంతో పాటు భద్రతా నియమాలను కఠినతరం చేయడంతో ఆధార్ ప్రస్థానం మరోసారి చర్చనీయాంశమైంది. అసలు ఆధార్ ఎప్పుడు ప్రారంభమైంది? కాలక్రమేణా ఇందులో ఎలాంటి మార్పులు వచ్చాయి? చిన్న పిల్లలు, విద్యార్థులకు ఆధార్ నియమాలు ఏమిటి? ఆన్‌లైన్‌లో ఏ వివరాలు మార్చుకోవచ్చు? నేను మీకు మొత్తం డీటైల్స్ చెబుతాను. చాలా ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ఆధార్ ఎప్పుడు ప్రారంభమైంది?.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆధార్ ప్రాజెక్టుకు 2009లో అంకురార్పణ జరిగింది. అధికారికంగా 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా తెంబిలి గ్రామానికి చెందిన ఒక మహిళకు దేశంలోనే మొట్టమొదటి ఆధార్ కార్డును జారీ చేశారు. పౌరుల వేలిముద్రలు, కంటిపాప స్కాన్ వంటి బయోమెట్రిక్ సమాచారంతో కూడిన 12 అంకెల విశిష్ట సంఖ్యను కేటాయించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. దీని ద్వారానే పదిహేడు వందలకు పైగా పౌర సేవలు, సామాజిక పథకాలు అందుతున్నాయి. బ్యాంకు ఖాతాలు తెరవడానికి, ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందడానికి, మొబైల్‌ సిమ్‌ కార్డులు తీసుకోవడానికి ఆధార్‌ తోడ్పడుతోంది. దలకు ప్రత్యక్ష నగదు బదిలీ, ఇతర సంక్షేమ పథకాలను అందించడానికి-జన్‌ధన్‌ బ్యాంక్‌ అకౌంట్లు, ఆధార్‌ బయోమెట్రిక్‌ గుర్తింపు, మొబైల్‌ అనుసంధానతకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ప్రత్యక్ష నగదు బదిలీలను ఆధార్‌తో అనుసంధానించడం ద్వారా 4.15 కోట్ల నకిలీ ఎల్‌పీజీ కనెక్షన్లు, 5.3 కోట్ల నకిలీ రేషన్‌ కార్డులు తొలగించగలిగారు. దానివల్ల రూ.1.85 లక్షల కోట్లను ప్రభుత్వం ఆదా చేయగలిగింది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద 98శాతం వేతన చెల్లింపులను ఆధార్‌ అనుసంధానం ద్వారా సకాలంలో జరుపుతున్నారు. ఇక ఆధార్‌ సాయంతోనే 220 కోట్ల డోసుల కొవిడ్‌ టీకాలు పక్కాగా అందాయి. ఆయుష్మాన్‌ భారత్‌ జన్‌ ఆరోగ్య యోజనలోనూ ఆధార్‌ కీలక పాత్ర పోషిస్తోంది. చిన్న పిల్లలకు ‘బాల్ ఆధార్’ ఉంటుంది. ఐదేళ్ల లోపు పిల్లల కోసం ప్రత్యేకంగా నీలి రంగులో ఉండే ‘బాల్ ఆధార్’ కార్డును UIDAI జారీ చేస్తుంది. ఈ వయసు పిల్లలకు వేలిముద్రలు, కంటిపాప స్కాన్ తీసుకోరు. కేవలం వారి ముఖచిత్రం మాత్రమే సేకరిస్తారు. పిల్లల జనన ధృవీకరణ పత్రంతోపాటు, తల్లిదండ్రులలో ఒకరి ఆధార్ కార్డు ఆధారంగా దీనిని జారీ చేస్తారు. పిల్లల కోసం కొత్తగా ఆధార్ తీసుకోవడానికి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసే వీలుండదు. తల్లిదండ్రులు పిల్లలను నేరుగా గుర్తింపు పొందిన ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి తీసుకువెళ్లాల్సిందే. విద్యార్థులకు ‘మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్’ తప్పనిసరి!చిన్న పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వారి శారీరక మార్పుల వల్ల వేలిముద్రలు, కంటిపాపల గుర్తులు మారుతుంటాయి. అందుకే విద్యార్థుల కోసం రెండు దశల్లో ‘మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్’ నిబంధనను తెచ్చింది. మొదటి దశలో ఐదేళ్లు దాటిన తర్వాత బాల్ ఆధార్ గడువు ముగుస్తుంది. కాబట్టి 5 నుండి 7 సంవత్సరాల లోపు పిల్లల వేలిముద్రలు, ఐరిస్, ఫోటోను మొదటిసారి ఆధార్ కేంద్రంలో అప్‌డేట్ చేయించాలి. రెండవ దశ లో 15 సంవత్సరాలు నిండిన తర్వాత విద్యార్థులు తమ బయోమెట్రిక్స్‌ను రెండవసారి విధిగా అప్‌డేట్ చేసుకోవాలి. అప్పుడే వారి వేలిముద్రలు పెద్దవారిలా శాశ్వతంగా రికార్డవుతాయి. ఈ బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోకపోతే ఆధార్ కార్డు తాత్కాలికంగా నిలిచిపోతుంది . ఫలితంగా స్కూల్ అడ్మిషన్లు, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడంలో విద్యార్థులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్‌ : ఏ వివరాలు ఎక్కడ అప్‌డేట్ చేయాలి? చాలా మంది తమ ఆధార్‌లో మార్పుల కోసం గంటల తరబడి కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిల్చుంటారు. కానీ కొన్ని సేవలను ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చు. చిరునామా, డాక్యుమెంట్స్‌ అప్‌డేట్‌ ఇంట్లోనే ఆన్‌లైన్‌ద్వారా చేసుకోవచ్చు. ఫోటో , బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్‌ కేంద్రానికి వెళ్లాలి. మొబైల్ నంబర్ / ఈమెయిల్ ఐడీ అప్‌డేట్‌ కోసం తప్పనిసరిగా ఆధార్‌ కేంద్రానికి వెళ్లాలి. పేరు, పుట్టిన తేదీ, లింగం అప్‌డేట్‌ కోసం కూడా ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి చేసుకుంటే ఉత్తమం. తి లావాదేవీలో ఆధార్ కీలకంగా ఎలా మారింది? ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవినీతిని, దళారీ వ్యవస్థను అరికట్టడానికి ప్రవేశపెట్టిన ఆధార్.. నేడు ప్రతీ ఆర్థిక, వ్యక్తిగత లావాదేవీలో భాగమైపోయింది. గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, పెన్షన్లు వంటి ప్రభుత్వ పథకాల డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరడానికి ఆధార్ లింకింగ్ తప్పనిసరి అయింది. గతంలో బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా రోజుల తరబడి సమయం పట్టేది. కానీ, ఆధార్ ఈ-కేవైసీ ద్వారా కేవలం కొద్ది నిమిషాల్లోనే ఈ ప్రక్రియలు పూర్తవుతున్నాయి. పన్ను ఎగవేతలను, నకిలీ పాన్ కార్డులను అరికట్టడానికి ఆదాయపు పన్ను శాఖ పాన్-ఆధార్ లింకింగ్‌ను విధిగా మార్చింది. పదేళ్ల క్రితం ఆధార్ తీసుకుని, ఇప్పటివరకు ఒక్కసారి కూడా అప్‌డేట్ చేయని వారి కోసం ఉచితంగా ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్‌డేట్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. తాజాగా ఆధార్ సేవలను స్మార్ట్‌ఫోన్లలో మరింత సురక్షితంగా అందించేందుకు UIDAI తాజాగా పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్‌ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ ఫీచర్లతో కూడిన అధికారిక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పాత యాప్‌లో స్క్రీన్‌పై పూర్తి వివరాలు కనిపించేవి. కానీ కొత్త యాప్‌లో అవసరమైన సమాచారాన్ని మాత్రమే సురక్షిత క్యూఆర్ కోడ్ ద్వారా షేర్ చేయవచ్చు. కేవలం ఎస్ఎంఎస్ ఓటీపీలపైనే ఆధారపడకుండా, ఫేస్ రికగ్నిషన్ ద్వారా యాక్సెస్ పొందే వీలు కల్పించారు. వినియోగదారులు తమ వేలిముద్రల డేటాను ఇతరులు దుర్వినియోగం చేయకుండా యాప్ ద్వారానే తాత్కాలికంగా లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే అద్భుతమైన ఫీచర్ ఇందులో ఉంది. క సాధారణ గుర్తింపు కార్డుగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆధార్, నేడు భారతదేశ డిజిటల్ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచింది. కాలానికి అనుగుణంగా మారుతూ, భద్రతా ప్రమాణాలను పెంచుకుంటూ ప్రజల డిజిటల్ జీవితాన్ని మరింత సులభతరం చేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఇండియన్స్‌ అంటే.. అక్కడ కూలీలే’.. భారతీయ మూలాలపై గర్వంగా చెప్పిన ట్రినిడాడ్ ప్రధాని

Published on: May 30, 2026 11:17 AM
Follow Us