Video: యువతితో గొడవ.. బస్సు డ్రైవర్‌ చేసిన పనికి వణుకుపుట్టాల్సిందే!

Updated on: Jun 01, 2025 | 4:59 PM

బెంగళూరులోని కస్తూర్బా రోడ్డులో బీఎమ్‌టీసీ బస్సు డ్రైవర్ ప్రశాంత్ ఒక యువతిపై బస్సు ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. యువతి తృటిలో తప్పించుకుంది. డ్రైవర్ ప్రమాదకర చర్యకు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా మంత్రి ఆదేశాల మేరకు, బీఎమ్‌టీసీ డ్రైవర్‌ను సస్పెండ్ చేశారు.

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) డ్రైవర్ ఒక యువతిపై బస్సు ఎక్కించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన కస్తూర్బా రోడ్డులోని క్షీన్స్ జంక్షన్(MG రోడ్) సమీపంలో జరిగింది. ఈ ఘటన మే 23వ తేదీ సాయంత్రం 5.40 గంటలకు జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. BMTC బస్సు డ్రైవర్, ఒక యువతి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంలో జంక్షన్ వద్ద కారు దిగిన ఒక యువతి BMTC బస్సు డ్రైవర్‌ను ప్రశ్నిస్తోంది. అయితే, డ్రైవర్ బస్సును యువతిపైకి తీసుకెళ్లాడు. ఆ యువతి తృటిలో తప్పించుకుంది. కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఆ యువతి ప్రాణానికే ప్రమాదం అయ్యేది. డ్రైవర్ చేసిన పనికి ప్రజలు షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బస్సు డ్రైవర్‌పై సస్పెన్షన్ వేటు

బిఎమ్‌టిసి బస్సును యువతిపైకి ఎక్కించేందుకు ప్రయత్నించిన డ్రైవర్ ప్రశాంత్‌ను సస్పెండ్ చేశారు. రవాణా మంత్రి రామలింగారెడ్డి సూచనల మేరకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Jun 01, 2025 04:57 PM