DK Aruna: కాళేశ్వరం అవినీతిపై కవిత వ్యాఖ్యలకు డికే అరుణ స్పందన

Updated on: Sep 01, 2025 | 9:17 PM

బీఆర్‌ఎస్ లో కవిత వ్యాఖ్యలతో చెలరేగిన వివాదంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. కాళేశ్వరం అవినీతి విషయమై మేము ఎప్పుడో మాట్లాడామని, ఇప్పుడు కవిత కోపంతో పేర్లు చెబుతున్నారని ఆరోపించారు. కుటుంబ విభేదాలను ప్రజలపై రుద్దటం తగదని హెచ్చరిస్తూ, కేసీఆర్ కుటుంబం మొత్తం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో కలకలం రేపిన కవిత వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఘాటుగా స్పందించారు. “కవిత మాట్లాడిన దాంట్లో కొత్తగా ఏముంది? మేము కాళేశ్వరంలో అవినీతిని ఎప్పుడో ఎత్తిచూపాం,” అని ఆమె అన్నారు. ఇటీవల కవిత బహిరంగంగా చేసిన ఆరోపణలు కేవలం కోపంతో కూడినవేనని, కొన్ని పేర్లు చెప్పడం వ్యక్తిగత అసంతృప్తికి సంకేతమని పేర్కొన్నారు. “కుటుంబ సమస్యలను ప్రజలపై రుద్దడం సరైంది కాదు,” అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మొత్తం కాళేశ్వరం అవినీతి కేసుపై బాధ్యత వహించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. “ఇది ఒకటిరెండు వ్యక్తుల వ్యవహారమేం కాదు. ఇది మొత్తం కుటుంబ పాలనలో ఉన్న లోపాల ఫలితం,” అని ఆమె అన్నారు.

 

Published on: Sep 01, 2025 09:17 PM