Bandi Sanjay: ‘కేసీఆర్‌ సగం మందికి సీట్లు ఇవ్వరు’.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Updated on: Aug 25, 2023 | 6:41 PM

బీఆర్‌ఎస్‌ నేతల్లో చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సర్వేలన్నీ బీజేపీ ఓడిపోతుందని చెబుతున్నాయని బండి సంజయ్‌ ఈ సందర్భంగా అన్నారు. మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌.. 'సీఎం ప్రకటించిన 115 మందిలో సగం మందికి బిఫామ్‌ ఇవ్వరు. పార్టీని కాపాడుకునే ఉద్దేశంతోనే ఇలా ప్రకటించాడు. బీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలో చేరుతారనే కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు. నియోజకవర్గాల్లో నేతల మధ్య గొడవలు...

ప్రకటించిన అభ్యర్థుల్లో సగం మందికి కూడా కేసీఆర్ సీట్లు ఇవ్వరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేతల్లో చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సర్వేలన్నీ బీజేపీ ఓడిపోతుందని చెబుతున్నాయని బండి సంజయ్‌ ఈ సందర్భంగా అన్నారు. మీడియాతో మాట్లాడిన బండి సంజయ్‌.. ‘సీఎం ప్రకటించిన 115 మందిలో సగం మందికి బిఫామ్‌ ఇవ్వరు. పార్టీని కాపాడుకునే ఉద్దేశంతోనే ఇలా ప్రకటించాడు. బీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలో చేరుతారనే కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించారు. నియోజకవర్గాల్లో నేతల మధ్య గొడవలు జరిగేలా కేసీఆర్ నిర్ణయం ఉంది’ అని చెప్పుకొచ్చారు. మరి బండి సంజయ్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.