పెళ్లయిన 6 నెలలకే.. వేధింపులు తట్టుకోలేక!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కట్న వేధింపులకు బలైన నవవధువు అంజలి ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదం నింపింది. పెళ్లైన ఆరు నెలలకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భర్త, అత్తమామల అదనపు కట్నం డిమాండ్లు, వేధింపులు భరించలేక గర్భవతి అయిన అంజలి ప్రాణాలు తీసుకుంది. తల్లిదండ్రులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన సమాజంలోని ధనదాహాన్ని, మహిళలపై హింసను మరోసారి గుర్తుచేసింది.
టెక్నాలజీ యుగంలోనూ కొందరు మనుషుల ఆలోచనా విధానం మారడంలేదు. ప్రస్తుతకాలంలో మహిళలు అన్నిరంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. కానీ, ఎంత ఎదిగినా అబల అబలేనా అనిపిస్తుంది. ఉన్నత చదువులు చదివి, కోరినంత కట్నం తీసుకొని అత్తవారింట అడగుపెట్టినా.. ఉద్యోగం చేసి సంపాదించి ఇచ్చినా ధనదాహం తీరడంలేదు కొందరికి. ఇప్పటికీ అదనపు కట్నం వేధింపులకు బలైపోతున్నారు మహిళలు. తాజాగా పెళ్లయిన ఆరు నెలలకే ఓ నవ వధువు భర్త, అత్తమామల ధనదాహానికి బలైపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామంలో పెళ్లైన ఆరు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. కమటం వెంకటేశ్వర్లు తన ఒక్కగానొక్క కుమార్తె అంజలిని అట్లూరి సాయి కుమార్ కి ఇచ్చి వివాహం చేశాడు. సాయికుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో కూతురు సుఖసంతోషాలతో ఉంటుందని కోరినంత కట్నం ఇచ్చి పెళ్లి జరిపించారు. అయితే ఇచ్చిన కట్నం చాలలేదంటూ.. అదనపు కట్నం తేవాలని భర్త, అత్తమామలు వేధించడం మొదలు పెట్టారని, దీనికి తోడు అనుమానంతో తరచూ అమ్మాయితో గొడవలు పడుతూ ఉండేవారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలోనే తన కుమార్తె గర్భవతి అయిందని, ఇప్పుడైనా గొడవలు సర్దుమణుగుతాయని భావించామని, కానీ అత్తమామల వేధింపులు అధికమయ్యాయని దాంతో తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు గా విలపించారు. పెళ్లయిన ఆరు నెలలకే ఇలా అంజలి ఆత్మహత్య చేసుకోవడంతో లచ్చగూడెం గ్రామస్తులు, బంధువులు బోరున విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తమ కుమార్తె మరణానికి కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్లకు శిక్ష పడేలా చేయాలని ..అత్త మామలు ,అల్లుడు వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు పిర్యాదు చేశారు..కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nallamala: అప్పుడు కల్యాణానికి వజ్రాల తలంబ్రాలు.. కట్ చేస్తే ఇప్పుడు వజ్రాల వేట
ఒంట్లో ఉన్న దెయ్యాన్ని పోగొట్టాలని.. కోడలితో బలవంతంగా
మంగళాద్రి ముఖ మండపానికి మహర్దశ
