పిల్లలకు లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి ?? హెల్దీ ఫుడ్‌ ఇలానే మేలు

|

Jun 21, 2024 | 7:44 PM

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్నాయి. స్కూల్‌కి వెళ్లే పిల్లలకి లంచ్‌ బాక్స్‌లో ఏం పెడితే ఇష్టంగా తింటారు? ఇంట్లో తల్లులు తెగ ఆలోచిస్తూ కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతుంటారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టే కొన్ని చిట్కాలు చూసేయండి. లంచ్‌ బాక్స్‌లో కూర, అన్నం మాత్రమే కాకుండా.. పండ్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివీ పెట్టాలి. అలాగైతే పిల్లలు ఆరోగ్యంగా, నిత్యం ఎనర్జిటిక్‌గా ఉంటారు. స్నాక్ టైమ్‌కి పల్లీపట్టి, పలు రకాల నట్స్‌తో చేసిన లడ్డూలు, లేదా అరటిపండు పెడితే మంచిది.

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్నాయి. స్కూల్‌కి వెళ్లే పిల్లలకి లంచ్‌ బాక్స్‌లో ఏం పెడితే ఇష్టంగా తింటారు? ఇంట్లో తల్లులు తెగ ఆలోచిస్తూ కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతుంటారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టే కొన్ని చిట్కాలు చూసేయండి. లంచ్‌ బాక్స్‌లో కూర, అన్నం మాత్రమే కాకుండా.. పండ్లు, డ్రైఫ్రూట్స్‌ వంటివీ పెట్టాలి. అలాగైతే పిల్లలు ఆరోగ్యంగా, నిత్యం ఎనర్జిటిక్‌గా ఉంటారు. స్నాక్ టైమ్‌కి పల్లీపట్టి, పలు రకాల నట్స్‌తో చేసిన లడ్డూలు, లేదా అరటిపండు పెడితే మంచిది. ఐదారేళ్లలోపు పిల్లలు కొంచెం కొంచెమే తినగలరు. అందుకే మీల్స్‌, స్నాక్స్‌ రూపంలో రోజుకి కనీసం ఆరుసార్లు తినేలా చూసుకోవాలి. పైగా నిరంతరం ఆడుతుంటారు కాబట్టి పెద్దవాళ్లతో పోలిస్తే వాళ్లకి శక్తి చాలా అవసరం. మీ పిల్లలు బాగా తినేవేంటో గమనించండి. వారంలో ఆరు లేదా ఐదు రోజులకీ ముందే ప్లాన్‌ చేసుకోండి. అన్నం, కూర కన్నా ఆ రెండింటినీ కలిపి చేసిన రైస్‌ వెరైటీ చాలామందికి నచ్చుతుంది. అందుకే పాలక్‌, టమాటా, క్యారెట్‌, బీట్‌రూట్‌, మిక్స్‌డ్‌ వెజిటబుల్‌, జీరా, పనీర్‌, ఎగ్‌ఫ్రైడ్‌ రైస్‌.. వంటి వాటిని రైతా కాంబినేషన్‌తో వారం మెనూలో రెండు రోజులపాటు చేర్చొచ్చు. ఒక వారం పెట్టినవి ఆ తరువాతి వారం పెట్టకుండా ఐటమ్స్‌ మార్చుకుంటూ వెళితే ఒకే రకం తింటున్నామన్న ఫీల్‌ కలగదు. ఈ వారంలో చపాతీ పెడితే వచ్చే వారం పరోటా చేయొచ్చు. ఆ చపాతీని సైతం ఒకసారి మునగాకుతోనూ మరోసారి పాలక్‌తోనూ చేస్తే మంచిది. దోశ, ఇడ్లీ, చపాతీ, పరాటా వంటివి వాళ్లు తినేందుకు వీలుగా చిన్న చిన్న సైజుల్లో చేస్తే మంచిది. మిగిలిన నాలుగు రోజుల్లో మెంతి, పాలకూర, మునగాకు, ఆలూ… వంటి వాటిని కలిపి చేసిన చపాతీ లేదా పరోటా, కూరగాయ ముక్కలన్నీ కలిపి చేసిన నూడుల్స్‌ లేదా పాస్తా; సేమ్యా ఉప్మా లేదా ఊతప్పం; ఇడ్లీ, దోశ లేదా చోళె బతూరా; శాండ్‌విచ్‌ లేదా పిజ్జా.. వంటివి పెడితే ఇష్టంగా తింటారు. చిన్నారులకు రోజూ పంపించే అల్పాహారంలో బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్‌, స్వీట్‌ కేక్స్‌, జంక్‌ ఫుడ్‌, ఇన్‌స్టంట్‌ ఫుడ్‌, నూనె పదార్థాలతో ఉన్నవి పంపొద్దంటూ నిపుణులు చేసే సూచనల్ని పాటించండి. వాటికి బదులు తాజా పండ్లు, తేలిగ్గా జీర్ణమయ్యే తాజా ఆహార పదార్థాలను పెడితే మంచిది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

త్వరలో.. రోజుకు 25 గంటలు !! వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పులు

రైల్వే ట్రాక్‌పై విశ్రాంతి తీసుకుంటున్న పది సింహాలు.. ఒక్క సారిగా వచ్చిన రైలు.. చివరికి ??

45 లక్షల విలువైన కారు కొన్న జబర్దస్త్‌ బ్యూటీ

కల్కిపై నెగెటివ్ కామెంట్స్‌ చేసిన యూట్యూబర్‌.. ఓ ఆట ఆడుకున్న విశ్వక్