అరటిపండు, ఖర్జూరంతో అలసటకు చెక్.. ఏ టైంలో తినాలంటే..?
అలసట, బలహీనత వంటి సమస్యలకు అరటిపండు, ఖర్జూరం ఉత్తమ పరిష్కారాలు. వీటిని సరైన సమయంలో తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు నిదానంగా శక్తినివ్వగా, ఖర్జూరం తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే, వీటిని ఎప్పుడు, ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం.
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య అలసట, బలహీనత. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు శక్తి లేకపోవడం, నీరసంగా అనిపించడం సర్వసాధారణంగా మారింది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది అరటిపండ్లు లేదా ఖర్జూరాలు తీసుకుంటూ ఉంటారు. అయితే, ఏది ఎప్పుడు తినాలనేది తెలుసుకుంటే ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఒక అరటిపండులో సుమారు 105 క్యాలరీలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, విటమిన్ C వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అరటిపండ్లలోని ఫైబర్ చక్కెరను నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. రోజంతా ఉత్సాహంగా పని చేయాలనుకునేవారికి లేదా ఎక్కువసేపు వ్యాయామం చేసేవారికి అరటిపండ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరిన్ని వివరాలను పై వీడియోలో చూడండి.