బాబా వంగా జ్యోతిష్యం.. 2026లో మూడో ప్రపంచ యుద్ధం వీడియో
జులై 5న జపాన్‌లో ప్రకృతి విపత్తు సంభవిస్తుందని న్యూ వంగా బాబా రియో టాట్సుకి జూలై 5, 2025న భారీ భూకంపం వస్తుందని ది ఫ్యూచర్ ఐసా పుస్తకంలో రాశారు. అయితే జులై 5న జపాన్‌లో ఎలాంటి విపత్తు సంభవించలేదు. కానీ జూలై నెలాఖరులో జపాన్‌లో భారీ భూంకపం రావడం.. జపాన్, అమెరికాను సునామీ అలలు తాకడం జరిగింది. అనేక దేశాలకు సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారు. దీంతో కాస్త ఆలస్యమైనా న్యూబాబా వంగా చెప్పిన జోష్యం జరిగిందని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
తాజాగా బల్గేరియాకు చెందిన ప్రముఖ అంధ ప్రవక్త బాబా వంగా 2026 సంవత్సరం గురించి చెప్పినట్టుగా ప్రచారంలో ఉన్న కొన్ని విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రకృతి విలయం నుంచి ప్రపంచ యుద్ధం వరకు ఆమె హెచ్చరికలు మానవాళికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.2026 గురించి బాబావంగా బాల్కన్ల నాస్ట్రడామస్”గా పేరుపొందిన ఆమె దశాబ్దాల క్రితమే కన్నుమూసినా.. ఆమె చెప్పిన భవిష్యవాణి నేటికీ అనేక సందర్భాల్లో నిజమవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ప్రపంచం తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోనుందని బాబా వంగా జోస్యం చెప్పినట్టు తెలుస్తోంది. భూమిపై దాదాపు 7 నుండి 8 శాతం భూభాగం భారీ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ మార్పులతో అల్లకల్లోలంగా మారుతుందని ఆమె హెచ్చరించింది. ఇప్పటికే 2025లో ఐరోపాలో రికార్డు స్థాయి వేడి, కెనడా, ఆస్ట్రేలియాలో కార్చిచ్చులు, పసిఫిక్ ప్రాంతంలో భూకంపాల తీవ్రత పెరగడం వంటి పరిణామాలు ఈ హెచ్చరికలకు బలం చేకూరుస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :