Hyderabad: హైదరాబాద్ రోడ్లపై ఆటోడ్రైవర్ ముద్దులాట.. జనాలు చూస్తున్నా సోయిలేకుండా

Edited By: Ravi Kiran

Updated on: Nov 07, 2025 | 11:57 AM

నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు.. నలుగురు ముందు చేస్తున్నారు. లైక్స్ కోసం వ్యక్తిగత జీవితాన్ని అందరి ముందుకు తెస్తున్నారు. మరి ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ ఘటన హైదరాబాద్ రోడ్లపై జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి.

హైదరాబాద్ పాతబస్తీలో ఓ ఆటో డ్రైవర్ రోడ్డుపైనే హద్దులు దాటాడు. ఆటోలో యువతితో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. ఇక అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ క్రాస్ రోడ్స్ నుంచి కోఠి రూట్‌లో ప్రజల ముందే బరితెగించాడు. ఓ యువతితో రొమాన్స్ చేస్తూ ఆటో నడిపాడు. రోడ్డుపైనే ఆటోడ్రైవర్ చేసిన ఈ నిర్వాకానికి వాహనదారులు షాక్ అయ్యారు. ఆ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొట్టడంతో పోలీసుల వరకు మ్యాటర్ వెళ్ళింది. ఆటో నెంబర్ ఆధారంగా డ్రైవర్‌పై చాదర్ ఘాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారికి సరైన గుణపాఠం నేర్పాలని స్థానికులు అంటున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ సారి లుక్కేయండి.