కలవరపెడుతున్న స్క్రబ్‌ టైఫస్‌..22 మంది మృతి

Updated on: Jan 02, 2026 | 5:02 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టిస్తోంది, ఇప్పటివరకు 22 మంది మరణించారు. దేశంలోనే 12వ స్థానంలో ఉన్న ఏపీలో చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. లక్షణాలు గుర్తించడంలో ఆలస్యం, సరైన అవగాహన లేకపోవడం మరణాలకు ప్రధాన కారణం. సకాలంలో గుర్తిస్తే సాధారణ జ్వరంలా నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాధి పూర్వాపరాలపై జీనోమ్ సీక్వెన్సింగ్‌కు సిద్ధమవుతోంది.

ఏపీ ప్రజలను స్క్రబ్ టైఫస్ వణికిస్తోంది. ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 22 మంది చనిపోయారు. డిసెంబరు 23న బాపట్లలో ఒకరు, కాకినాడలో ఒకరు ఈ టైఫస్ లక్షణాలతో మృతి చెందారు. ఈ స్క్రబ్ టైఫస్ కేసుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2వేల వరకు పాజిటివ్ కేసులు నమోదైతే.. గత మూడేళ్లుగా చిత్తూరు జిల్లాలోనే చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఈ జిల్లాలో 491 కేసులు నమోదయ్యి మొదటి స్థానంలో ఉంటే… కాకినాడలొ 198, విశాఖపట్నం లో 158 కేసులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. స్క్రబ్‌ టైఫస్‌ను సకాలంలో గుర్తిస్తే సమస్య ఉండదని అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. తొలుత జ్వరాలకు వాడే సాధారణ మందులు వేసుకొని, పరిస్థితి చేయిదాటాక ఆసుపత్రుల్లో చేరుతుండటంతో ప్రాణాల మీదకు వస్తోందని వైద్యులు చెబుతున్నారు. పరిసరాల అపరిశుభ్రత, జాగ్రత్తలపై అవగాహన లేమి సమస్యగా మారుతున్నాయి. ఈ జ్వరాన్ని సకాలంలో గుర్తిస్తే, సాధారణ జ్వరంలానే తగ్గిపోతుందని వైద్యలు చెబుతున్నారు. మరణించిన వారిలో ఎక్కువ మందికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. స్క్రబ్ టైఫస్ వంటి జ్వరాలు గత 40 ఏళ్లుగా వస్తున్నాయని.. అయితే గత రెండేళ్లుగా ఈ కేసుల సంఖ్య కొంచెం పెరిగాయంటున్నారు. దేశవ్యాప్తంగా స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌ కేసులు వస్తున్నా, ఏపీలోనే మరణాలు నమోదు కావడం కలవరపెడుతోంది. వ్యాధి పూర్వాపరాలపై లోతుగా అధ్యయనానికి, బ్యాక్టీరియాలో రకాలు గుర్తించడానికి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తేనెటీగకు లీగల్‌ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత

10 రోజులు షుగర్ తినడం మానేస్తే మన శరీరంలో జరిగేది తెలిస్తే

జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది

ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం

Lunar Eclipse 2026: మార్చి 3న తొలి చంద్రగ్రహణం