CM Jagan-UGADI: తెలుగు సంస్కృతి, సంప్రదాయాలతో శోభిల్లుతున్న తాడేపల్లి..ఉగాది ఉత్సవాలకు ముందు ఆలయంలో సీఎం జగన్ దంపతుల ప్రత్యేక పూజలు

|

Mar 22, 2023 | 9:31 AM

తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంట్లో ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి పాల్గొన్నారు.

CM Jagan UGADI Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉగాది పండుగ జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది.. తెలుగు లోగిళ్లలో నూతన సంవత్సర శోభను తెస్తూ.. కొత్త లక్ష్యాలకు, ఆలోచనలకు, ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలే జరగాలి, సమృద్ధిగా వానలు కురవాలి, పంటలు బాగా పండాలి. రైతులకు మేలు జరగాలి’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు.  తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంట్లో ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి దంపతులు వైఎస్ జగన్, వైఎస్ భారతి పాల్గొన్నారు. వేడుకల కోసం తెలుగుదనం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Published on: Mar 22, 2023 09:31 AM