AP BJP Chief Madhav: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Updated on: Mar 28, 2026 | 9:33 PM

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వివాదం, జంతువు కొవ్వు ఆరోపణలు, బీజేపీ బాధ్యతపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ టీవీ9 క్రాస్‌ఫైర్ ఇంర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరంన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వివాదాస్పద అంశంగా మారిన తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలసిందా లేదా అన్న ప్రశ్నపై మాధవ్ స్పందిస్తూ, లడ్డూ నెయ్యితో తయారైందనేది వాస్తవమని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీజేపీదేనని ఆయన నొక్కిచెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లడ్డూ వివాదం, జంతువు కొవ్వు ఆరోపణలు, బీజేపీ బాధ్యతపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ టీవీ9 క్రాస్‌ఫైర్ ఇంర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరంన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వివాదాస్పద అంశంగా మారిన తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలసిందా లేదా అన్న ప్రశ్నపై మాధవ్ స్పందిస్తూ, లడ్డూ నెయ్యితో తయారైందనేది వాస్తవమని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంలో ప్రజల విశ్వాసం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీజేపీదేనని ఆయన నొక్కిచెప్పారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరగాలని, అపవిత్రత ఏ మేరకు జరిగిందో, దాన్ని ఎలా తొలగించాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అనేక విచారణలు జరుగుతున్నప్పటికీ స్పష్టత రాకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లడ్డూ వివాదం టీడీ, వైఎస్‌ఆర్‌సిపి మధ్య జరిగిన రాజకీయ కొట్లాటగా ఆయన అభివర్ణించారు, ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us