Andhra Pradesh: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం ఎప్పట్నుంచంటే..?

|

Aug 09, 2024 | 5:33 PM

అతి త్వరలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి. విజయవాడలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి బ్రాండ్‌ ఏసీ బస్సులకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఈనెల 12న సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీసీపై సమీక్ష నిర్వహిస్తారని...ఫ్రీ బస్సు, ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి.

మహిళలకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ ప్రకారం… మరో వారం రోజుల్లో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణంపై ప్రధానంగా చర్చించారు. అతి తర్వలోనే మహిళలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామన్నారు. అయితే ఈనెల 12న మరోసారి ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు భేటీకానున్నారు. ఆ తర్వాత… ఎప్పటి నుంచి ఫ్రీ బస్సు ప్రయాణం అనేదానిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Aug 09, 2024 05:32 PM