Dussehra Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో పెరిగిన దసరా సెలవులు

Updated on: Sep 19, 2025 | 6:30 PM

ఏపీ ప్రభుత్వం దసరా సెలవులను రెండు రోజులు పెంచి, మొత్తం 12 రోజులు చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. దసరా పండుగ సందర్భంగా ఇప్పటికే ప్రకటించిన 10 రోజుల సెలవులను మరో రెండు రోజులు పెంచి, మొత్తం 12 రోజులకు పెంచుతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయి. మునుపటి అకాడెమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు నిర్ణయించబడ్డాయి. ఈ తాజా నిర్ణయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు అదనంగా రెండు రోజులు సెలవు లభించనున్నాయి. అక్టోబర్ 3వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.