Telangana: ఊరు చివరన పురాతన ఆలయం.. లోపలికి వెళ్లి చూడగా.. బాబోయ్.!

Updated on: Sep 15, 2025 | 11:37 AM

ఆ దేవాలయం ఊరు చివరన ఉంది. అదొక మారుమూల గ్రామం. అటుగా వెళ్ళిన స్థానికులు అలా ఆలయంలోకి వెళ్లి చూడగా.. బాబోయ్.! దెబ్బకు అక్కడ కనిపించింది చూసి కంగారుపడ్డారు. వెంటనే ఇతరులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా..

నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం బాణాల గ్రామంలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. ఉదయాన్నే ఆలయం తలుపులు తీసేందుకు వచ్చిన పూజారికి.. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి దెబ్బకు షాక్ అయ్యారు. గుప్తనిధుల వేట కోసం వచ్చి స్థానిక శివాలయం గోపురంను కూలగొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆలయ గోపురాన్ని కూలగొట్టి లోపలికి దూరడానికి ప్రయత్నించారు. ఈ ఘటన స్థానికంగా వైరల్ కాగా.. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 

 

Published on: Sep 15, 2025 11:37 AM