Watch: మంటల్లో పూర్తిగా దగ్ధమైన మరో బస్సు..షాకింగ్ వీడియో వైరల్..
సమ్మన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్‌నగర్ నుండి అక్బర్‌పూర్ వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులో నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా వరుస బస్సు ప్రమాదాలు ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంభవించిన వరుస ప్రమాదాల నుంచి ప్రజలు కోలుకోకముందే..మరో చోట ప్రమాదం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఒక బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. యూపీలోని అంబేద్కర్ నగర్‌లో మంగళవారం పెద్ద ప్రమాదం తప్పింది. అక్బర్‌పూర్‌కు ప్రయాణీకులతో నిండిన రోడ్డు బస్సు అకస్మాత్తుగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమ్మన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామ్‌నగర్ నుండి అక్బర్‌పూర్ వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సులో నుంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..