Video: అయ్యో..! వినాయకుడితో పాటు 5 తులాల బంగారం గొలుసు నిమజ్జనం.. చివరకు

Updated on: Sep 01, 2025 | 11:29 AM

వినాయక నవరాత్రి ఉత్సవాలు ఊరూరా.. వాడవాడలా వైభవంగా జరుగుతున్నాయి. వీధులన్నీ గణనాథుల మండపాలతో శోభాయమానంగా మారిపోయాయి. 'గణపతి బప్పా మోరియా..' నినాదాలతో, భక్తుల సందడితో పండగ వాతావరణం నెలకొంది. ఇక పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు జరిగాయి. ఎక్కడ చూసినా గణనాథుని విగ్రహాలను తీసుకెళ్తున్న వాహనాలు, భక్తుల కోలాహలం కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ శివారు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్ చెరువు వద్ద ఒక ఆసక్తికర ఘటన జరిగింది.

వినాయకుడితో పాటు పొరపాటున ఐదు తులాల బంగారు గొలుసును నిమజ్జనం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువు దగ్గర జరిగింది. హస్తినాపురానికి చెందిన స్థానికుల్లో ఒక ఫ్యామిలీ ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నారు. వినాయక విగ్రహానికి మెడలో ఐదు తులాల బంగారు గొలుసు వేసి మూడు రోజుల పాటు పూజలు చేశారు. వినాయకుడి దగ్గర బంగారం పెట్టినా, వినాయకుడి మెడలో బంగారం వేసిన తర్వాత తిరిగి ధరించినా కాలం కలిసొస్తుందని, మంచి జరుగుతుందని కొందరి నమ్మకం. ఈ కుటుంబం కూడా ఇంట్లో పూజించిన గణేశుని మెడలో గోల్డ్ చైన్ వేసింది.